Trigrahi Yoga: మీన రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం.. అందులో మీరూ ఉన్నారా..?
మీనరాశిలో గురు, సూర్యుడు, బుధుడు ఒకే సమయంలో సంచరించడం వల్ల తిగ్రాహి సంయోగం ఏర్పడింది. మరోవైపు దేవతల గురువైన బృహస్పతి అదృష్టానికి కారకుడు, సూర్యుడు విజయానికి అలాగే బుధుడు సంపద..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చడంతో పాటు ఇతర గ్రహాలతో సంయోగం చెందుతుంటాయి. అంటే ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో సంచరించడం. ఇక ఈ గ్రహాల కలయిక లేదా సంయోగ ప్రభావం రాశిచక్రంలోని 12 రాశుల మీద కూడా ఉంటుంది. అయితే ఇది కొన్ని రాశులకు శుభంగా, అలాగే మరి కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఇక ఇటీవలే మీనరాశిలో మూడు గ్రహాల కలయిక ఏర్పడింది. ఎలా అంటే మీనరాశిలో గురు(బృహస్పతి), సూర్యుడు, బుధుడు ఒకే సమయంలో సంచరించడం వల్ల తిగ్రాహి సంయోగం ఏర్పడింది. దేవతల గురువైన బృహస్పతి అదృష్టానికి కారకుడు, సూర్యుడు విజయానికి అలాగే బుధుడు సంపద, తెలివితేటలకు మూల కారకుడు. ఈ నేపథ్యంలో ఈ 3 గ్రహాలు కలిసి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరచడం వల్ల రాశిచక్రంలోని 3 రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఈ సమయంలో వారికి ధనలాభం, జాబ్ ఆఫర్, ప్రమోషన్ వంటివెన్నో లభిస్తాయి. ఇంతకీ ఆ మూడు రాశులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
త్రిగ్రాహి యోగం ఈ 3 రాశులకు శుభప్రదం..
వృశ్చిక రాశి: మీన రాశిలో ఏర్పడిన త్రిగ్రాహి యోగం వృశ్చికరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం, కెరీర్‌లో గొప్ప పురోగతి, కొత్త జాబ్ ఆఫర్ వంటివి లభిస్తాయి. అదే క్రమంలో వారి జీతం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితం అయితే మహాద్భుతంగా ఉంటుంది.
ధనుస్సు రాశి: సూర్యుగురుబుధ గ్రహాల కలయికతో ఏర్పడిన ఈ త్రిగ్రాహి యోగం ధనుస్సు రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ధనస్సు రాశివారి ఆదాయం పెరుగుతుంది. జీవితంలో సుఖాలు పెరగడంతో పాటు.. కొత్త ఇల్లు-కారు, ఖరీదైన నగలు-బట్టలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీన రాశి: ఈ మీన రాశిలోనే త్రిగ్రాహి యోగం ఏర్పడనుండడంతో మీనరాశి వారు చాలా ప్రయోజనాలను పొందుతారు. వీరి వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. అవివాహితులకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)