Ashwagandha: పురుషులకు ఇది దివ్యౌషధం.. దీని ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. అవేమిటంటే..?

పెన్నేరు గడ్డ, పన్నీరు, వాజిగంధి వంటి పేర్లతో ప్రసిద్ధి పొందిన అశ్వగంధ మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రకృతి ప్రసాధించిన ఔషధ మొక్కలలో ఇది కూడా ఒకటని..

Ashwagandha: పురుషులకు ఇది దివ్యౌషధం.. దీని ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు.. అవేమిటంటే..?
Ashwagandha Benefits
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 25, 2023 | 9:28 PM

ఆయుర్వేదంలో రారాజుగా పేరొందిన అశ్వగంధతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పెన్నేరు గడ్డ, పన్నీరు, వాజిగంధి వంటి పేర్లతో ప్రసిద్ధి పొందిన అశ్వగంధ మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రకృతి ప్రసాధించిన ఔషధ మొక్కలలో ఇది కూడా ఒకటని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటారు. అశ్వగంధను ఆయుర్వేదంలోనే కాక యునాని ఔషధం, సిద్ధ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. అలాగే అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి అనే పేర్లతో మార్కెట్‌లో లభించే అశ్వగంధ మన శరీరంలోని అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం. ఈ క్రమంలో అశ్వగంధతో ఎటువంటి ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం: ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిక్ కేసులు బాగా ఎక్కువయ్యాయి. అశ్వగంధ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో గల చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఒత్తిడి నివారణ: అశ్వగంధలో ఉండే కార్టిసాల్ అనే సమ్మేళనం ఒత్తిడిని తగ్గిస్తుంది. మన అడ్రినల్ గ్రంథులు ఒత్తిడికి గురైనప్పుడు, రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు కార్టిసాల్‌ను విడుదల చేస్తాయి. శరీరంలో ఈ ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తిని తగ్గించడంలో అశ్వగంధ సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

శృంగార సమస్యలు: అశ్వగంధ శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడంతో పాటు పురుషులలో లైగింక వాంఛ, లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వార సంతాన సమస్యలకు చెక్ పెడుతుంది.

నిద్రలేమి: నిద్రలేమితో బాధపడేవారు అశ్వగంధను తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇటీవలి అధ్యయనాలు ప్రకారం అశ్వగంధ నిద్రను మెరుగుపరచడానికి సమర్థవంతమైన సహజ చికిత్స.

బరువు: అశ్వగంధలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా బరువును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

రక్తహీనతకు చెక్: అశ్వగంధలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంతో పాటు దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.

కొలెస్ట్రాల్‌ నియంత్రణ: అశ్వగంధ యాంటీ ఇనఫ్లేమటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..