AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lovers Suicide: 250 అడుగుల కొండపై నుంచి దూకిన ప్రేమజంట.. పొదల్లో చిక్కుకుని ఆహాకారాలు

ఇరుకుటుంబాల్లో తమ ప్రేమకు అంగీకారం తెలుపలేదని ఓ ప్రేమ జంగ కొండ మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రామనగర జిల్లాలోని రామదేవర బెట్టకు చెందిన..

Lovers Suicide: 250 అడుగుల కొండపై నుంచి దూకిన ప్రేమజంట.. పొదల్లో చిక్కుకుని ఆహాకారాలు
Lovers Attempted Suicide
Srilakshmi C
|

Updated on: Mar 26, 2023 | 8:18 PM

Share

ఇరుకుటుంబాల్లో తమ ప్రేమకు అంగీకారం తెలుపలేదని ఓ ప్రేమ జంగ కొండ మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రామనగర జిల్లాలోని రామదేవర బెట్టకు చెందిన డాక్టర్ విష్ణువర్ధన్ రోడ్డులోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో చేతన్ (19) బీఈ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అదే కాలేజీలో బీకాం ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోన్న సాహిత్య (19), చేతన ఇద్దరు గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరువురి ఇళ్లల్లో పెద్దలు అంగీకరించకపోవడంతో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సమీపంలోని కొండ మీద నుంచి కిందికి దూకారు. ఐతే కొండ కింద ఉన్న చెట్లలో చిక్కుకుని కాపాడండంటూ ఆర్తనాదాలు చేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న రామనగర రూరల్‌ పోలీసులు జి వై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పొదల్లో గంటపాటు గాలించి.. అనంతరం రెండు గంటలపాటు శ్రమించి ఇరువురిని కాపాడారు. గాయాలపాలైన చేతన్‌, సాహిత్యలను రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. తామిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని, తమ పెళ్లికి పెద్దలు అంగీకారం తెలుపలేదని అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. 250 అడుగుల ఎత్తు నుంచి దూకినప్పటికీ పొదల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారని, ఒకట్రెండు రోజులు ఎవరూ గమనించకపోయి ఉంటే వారు చనిపోయి ఉండేవారని పోలీసులు తెలిపారు. కాగా రామదేవర బెట్టని దేశంలోని ఏకైక రాబందుల అభయారణ్యం. ఫేమస్‌ షూటింగ్ లొకేషన్‌లలో ఇది ఒకటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.