- Telugu News Photo Gallery Cinema photos Actress Keerthy Suresh Interesting Comments on Love and Breakup
Keerthy Suresh: ‘బ్రేకప్ చేదుగా ఉంటుంది’ వైరలవుతోన్న కీర్తి సురేష్ కామెంట్స్
తెలుగు ప్రేక్షకులకు నటి కీర్తి సురేష్ పరిచయం అక్కరలేని పేరు. మహానటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజాగా దసరా సినిమాలో నాని సరసన నటించిన విషయం తెలిసిందే..
Updated on: Mar 27, 2023 | 6:47 AM

తెలుగు ప్రేక్షకులకు నటి కీర్తి సురేష్ పరిచయం అక్కరలేని పేరు. మహానటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తాజాగా దసరా సినిమాలో నాని సరసన నటించిన విషయం తెలిసిందే

బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈక్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

తాజాగా యాంకర్ సుమతో నిర్వహించిన ఇంటర్వ్యూకి హాజరైన కీర్తి సురేష్ ప్రేమ, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

బ్రేకప్ చేదుగా ఉంటుందా? మందు చేదుగా ఉంటుందా అని సుమ ప్రశ్నించగా.. ఏమాత్రం ఆలోచించకుండా బ్రేకప్ చేదుగా ఉంటుందని కీర్తి సమాధానం చెప్పింది.

మీ లైఫ్‌లో అలాంటి బ్రేకప్ జరిగిందా అని అడిగితే నవ్వుతూ లేదని చెప్పి తప్పించుకుంది. కీర్తి సమాధానం విని పక్కనే ఉన్న నాని మహానటి.. అంటూ పాటపాడుతూ కీర్తిని ఆటపట్టించాడు. కీర్తి సురేష్ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.





























