వామనుడిలా పెరుగుతున్న 14 ఏళ్ల బాలుడు.. బూట్ల సైజు 23.. ఎత్తు 6 అడుగులకుపైనే

పద్నాలుగేళ్ల పిల్లాడి చెప్పుల సైజు ఎంతుంటుంది.. మహాఅయితే 5 లేదా 6 ఉంటుంది. ఐతే అమెరికాలోని ఈ పిల్లాడి పాదం సైజు మాత్రం ఏకంగా 23 ఉంది. దీంతో బూట్లు కొనడానికి ప్రపంచమంతా గాలిస్తోంది ఈ 14 ఏళ్ల బాలుడి తల్లి. వివరాల్లోకెళ్తే..

వామనుడిలా పెరుగుతున్న 14 ఏళ్ల బాలుడు.. బూట్ల సైజు 23.. ఎత్తు 6 అడుగులకుపైనే
Worlds Biggest Shoe
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 28, 2023 | 11:39 AM

పద్నాలుగేళ్ల పిల్లాడి చెప్పుల సైజు ఎంతుంటుంది.. మహాఅయితే 5 లేదా 6 ఉంటుంది. ఐతే అమెరికాలోని ఈ పిల్లాడి పాదం సైజు మాత్రం ఏకంగా 23 ఉంది. దీంతో బూట్లు కొనడానికి ప్రపంచమంతా గాలిస్తోంది ఈ 14 ఏళ్ల బాలుడి తల్లి. వివరాల్లోకెళ్తే.. అమెరికాలోని మిచిగాన్‌లోని ఓర్టన్‌విల్లేకు చెందిన 14 ఏళ్ల ఎరిక్ కిల్‌బర్న్‌ జూనియర్‌ అనే పిల్లాడి పాదాలకు సరిపోయే బూట్లు దొరక్కపోవడంతో 22 సైజున్న బూట్లు ధరించాడు. ఐతే 23 ఇంచుల పాదాలకు కేవలం 22 ఇంచుల బూట్లు ధరించడంతో రెండు కాళ్లకు బొబ్బలు, గాయాలయ్యాయి. దీంతో ఇతర పిల్లలతో ఆడుకోలేక ఇబ్బందిపడిపోతున్నాడు. తల్లి రెబకా (36) కొడుకు ఎరిక్‌కు బూట్లు కొనడానికి తిరగని షాపు లేదు. వామనుడిలా ఎదుగుతున్న పిల్లాడి ఎత్తు 6 అడుగుల 10 అంగుళాలు. చివరికి బూట్లు తయారు చేసే కంపెనీలను కూడా వేడుకుంది. వాళ్లు కూడా ఈ మహాబలుడి పాదాలకు చెప్పులు తయారుచేయలేక చేతులెత్తేశారు.

వీరి పరిస్థితిపై స్థానిక మీడియా సంస్థ ప్రసారం చేసిన కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఎట్టకేలకు ప్యూమా అండ్‌ అండర్ ఆర్మర్ అనే కంపెనీ సైజు 23 షూలను ప్రత్యేకంగా తయారు చేసేందుకు ముందుకొచ్చింది. తాము తాయారు చేయబోయే బూట్లు ఇప్పటి వరకు తయారు చేసిన బూట్లన్నింటి కంటే అతిపెద్దవికానున్నాయని తెలిపారు. ఫుట్‌వేర్ డెవలప్‌మెంట్ సీనియర్ డైరెక్టర్ రాబ్ క్రాప్ మాట్లాడుతూ.. ఇలాంటి షూ పరిమాణం ఉన్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉంటారు. పిల్లల అభివృద్ధికి ఆటలు చాలా అవసరం. అందుకే మేము ఎరిక్‌కు షూ తయారు చేయడానికి ముందుకు వచ్చామని ఆయన అన్నారు.

నిజానికి ఎరిక్‌కు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. అయినప్పటికీ ఇతర పిల్లల మాదిరిగాకాకుండా అసాధారణంగా ఎదుగుతున్నాడు. ఎరిక్‌ ఏడో తరగతి చదివేటప్పుడు షూ సైజు 11. ఒక దశలో ఎరిక్‌కు సరిపడా షూ దొరకకపోవడంతో రెండేళ్లపాటు క్రోక్స్ ధరించవలసి వచ్చింది. ఐతే ఎరిక్‌ ఇంకా ఎదుగుతున్నందున భవిష్యత్తులో అతని పాదాల సైజు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికన్ పురుషుల గరిష్ఠ షూ పరిమాణం 10.5 ఇంచులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.