AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking: ఇళ్లంతా నిశ్శబ్ధం.. అనుమానం వచ్చి డోర్ ఓపెన్ చేసిన ఇంటి ఓనర్.. ఒక్కక్షణం గుండె ఆగిపోయిందంతే..

అన్ని రోజులు కూతురుతో ఒక్కతే సంతోషంగా జీవించింది. మగ తోడు లేకపోయినా.. నాలుగేళ్ల కన్న కూతురుతో జీవనం సాగించింది. చిన్నారితో సరదాగా గడిపింది. ఇంతలో ఏం అయ్యిందో ఏమో గానీ.. ఒక్కసారిగా పిడుగులాంటి దృశ్యాలు కలకలం రేపాయి. అబంశుభం తెలియని చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకున్న

Shocking: ఇళ్లంతా నిశ్శబ్ధం.. అనుమానం వచ్చి డోర్ ఓపెన్ చేసిన ఇంటి ఓనర్.. ఒక్కక్షణం గుండె ఆగిపోయిందంతే..
Crime
Shiva Prajapati
|

Updated on: Mar 29, 2023 | 7:58 AM

Share

అన్ని రోజులు కూతురుతో ఒక్కతే సంతోషంగా జీవించింది. మగ తోడు లేకపోయినా.. నాలుగేళ్ల కన్న కూతురుతో జీవనం సాగించింది. చిన్నారితో సరదాగా గడిపింది. ఇంతలో ఏం అయ్యిందో ఏమో గానీ.. ఒక్కసారిగా పిడుగులాంటి దృశ్యాలు కలకలం రేపాయి. అబంశుభం తెలియని చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లే కత్తితో పొడిచి పొడిచి చంపింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూణెలోని హప్సర్ ప్రాంతంలో ఓ మహిళ తన నాలుగేళ్ల చిన్నారి కూతురుతో కలిసి నివసిస్తోంది. బేకరీ ఉత్పత్తులను విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇంటిని అద్దెకు తీసుకున్న మహిళ కొంతకాలంగా కూతురుతోనే ఒంటరిగా ఉంటోంది. ఇంతలో ఆమె తాను గది ఖాళీ చేస్తున్నట్లు ఇంటి యజమానికి చెప్పింది. ఎవరికీ తెలియకుండానే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఇంటి తాళం కోసం యజమాని ఆమె గదికి వెళ్లాడు. తలుపులు మూసి ఉండటంతో అనుమానం వచ్చిన యజమాని.. డోర్ పగలగొట్టాడు. ఇంట్లో షాకింగ్ సీన్ కనిపించింది. కత్తిపోట్లకు గురైన నాలుగేళ్ల చిన్నారి రక్తపు మడగులో పడి చనిపోయి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఇంటి యజమాని.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. తల్లే హత్య చేసి పారిపోయిందని నిర్ధారించుకున్నారు. ఆ తరువాత ఆమె కోసం గాలించి పట్టుకున్నారు. ఆమెను విచారించగా తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించింది ఆ కసాయి తల్లి. అయితే, చిన్నారిని ఎందుకు చంపింది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని హత్య చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!