AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diapers Effects: డైపర్స్ వాడుతున్నారా? తల్లులు చేసే ఈ తప్పులు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..!

ప్రస్తుతం మార్కెట్లో పిల్లలకు వివిధ రకాల డైపర్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు మూత్రం, మల విసర్జన చేసినా ఈజీగా ఛేంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో అయితే బిడ్డ ఎన్నిసార్లు మలమూత్రం చేస్తే.. అన్నిసార్లు నీటితో శుభ్రం చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ తిప్పలు లేవు. శిశువుకు డైపర్ వేసి బయటికి తీసుకెళ్లడం చాలా సౌకర్యంగా ఉంటుంది.

Diapers Effects: డైపర్స్ వాడుతున్నారా? తల్లులు చేసే ఈ తప్పులు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..!
Baby Diaper
Shiva Prajapati
|

Updated on: Mar 28, 2023 | 7:30 AM

Share

ప్రస్తుతం మార్కెట్లో పిల్లలకు వివిధ రకాల డైపర్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు మూత్రం, మల విసర్జన చేసినా ఈజీగా ఛేంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో అయితే బిడ్డ ఎన్నిసార్లు మలమూత్రం చేస్తే.. అన్నిసార్లు నీటితో శుభ్రం చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ తిప్పలు లేవు. శిశువుకు డైపర్ వేసి బయటికి తీసుకెళ్లడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే.. బిడ్డకు ఎలా డైపర్ చేస్తారు? అనేది పాయింట్. ఎందుకంటే దానిని వేసే పద్ధతి కూడా పిల్లల అనారోగ్యానికి కారణమవుతుందట.

పూర్వ కాలంలో చిన్న పిల్లలకు క్లాత్‌తో తయారు చేసిన ఇన్నర్స్(లంగోటీలు) వేసేవారు. ఇది త్రిభుజాకారంలో ఉండేది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. వీటిని కాటన్ క్లాత్‌తో తయారు చేస్తారు. పిల్లలు మలమూత్ర విసర్జన చేస్తే.. వాటిని శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించేవారు. ఈ కాటన్ క్లాత్‌లు చాలా మెత్తగా ఉన్నప్పటికీ.. అందులో నుంచి మూత్రం, మలం బయటకు వచ్చేవి.

డైపర్లు ధరించేటప్పుడు ఈ తప్పులు చేస్తారు..

ఇవి కూడా చదవండి

ప్రస్తుత కాలంలో పిల్లలకు గంటలు గంటలు డైపర్లు వేసి ఉంచడం చూస్తూనే ఉన్నాం. డైపర్ నిండిన తరువాతే వాటిని తొలగిస్తారు. 2, 3 ఏళ్ల పిల్లలకు కూడా డైపర్లు వేస్తుంటారు. పిల్లలు మల,మూత్ర విసర్జన చేస్తే వాటిని తీసేయాలి. అయితే, డైపర్ వేసే ముందు తల్లులు కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. డైపర్ వేసే ముందు పిల్లలకు ఆయిల్, మరేదైన క్రీమ్ తో మాయిశ్చరైజింగ్ చేయాలి.

సాధారణ డైపర్లు వేయడం వల్ల పిల్లలకు వచ్చే వ్యాధులు..

చిన్న పిల్లలకు ఎప్పుడూ డైపర్లు వేయడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. డైపర్‌లోనే మల,మూత్ర విసర్జన చేసి, దానిని కాసేపు అలాగే ఉంచడం వల్ల అసిడిక్, ఆల్కలీన్ బ్యాక్టీరియా కలిసిపోయి ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. డైపర్లను ఉపయోగించడం వల్ల పిల్లల చర్మం దెబ్బతింటుంది. డైపర్ ఎక్కువ సేపు వేసి ఉంచడం వల్ల దద్దుర్లు వస్తాయి. ఈ విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. డైపర్లు ఎక్కువ సమయం వేసి ఉంచడం వల్ల పిల్లలు చికాకు పడతారు, ఏడుస్తారు. డైపర్లు ఎక్కువగా వేయడం వల్ల పిల్లలు తమకు మూత్రం వస్తుందనే విషయాన్ని చెప్పడంలో ఆలస్యం చేస్తారు.

డైపర్లు వేస్తే ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి..

చిన్న, నవజాత శిశువులకు మాత్రమే డైపర్లు వేయాలి. ఎందుకంటే.. నవజాత శిశువులు మాత్రమే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తారు. శిశువు 2, 3 సార్లు ఏడిస్తే డైపర్ మార్చాలి. డైపర్ నిండేంత వరకు అలాగే ఉంచితే.. పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలు డైపర్‌లో మల విసర్జన చేస్తే వెంటనే మార్చేయాలి. నీటితో కడగాలి. 24 గంటలు డైపర్లు వేసి ఉంచొద్దు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ప్రయోజనాలను ఉద్దేశించి, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాలను ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. పిల్లలకు సంబంధించి ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..