Relationship: ఒక అమ్మాయి తన భాగస్వామి నుంచి ఈ 4 విషయాలనే కోరుకుంటుందట.. అవేంటంటే..

స్త్రీ మనసు సముద్రమంత లోతు అంటారు. అందుకే వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటుంటారు. అయితే, తాము అలా ఉండమని, తమను అర్థం చేసుకోవడం చాలా ఈజీగా అని ఆడవారు అంటుంటారు. ఏది ఏమైనా.. సంబంధాల విషయానికొస్తే సాధారణంగానే స్త్రీల తీరు పురుషులకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

Relationship: ఒక అమ్మాయి తన భాగస్వామి నుంచి ఈ 4 విషయాలనే కోరుకుంటుందట.. అవేంటంటే..
Couple
Follow us

|

Updated on: Mar 27, 2023 | 8:45 AM

స్త్రీ మనసు సముద్రమంత లోతు అంటారు. అందుకే వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటుంటారు. అయితే, తాము అలా ఉండమని, తమను అర్థం చేసుకోవడం చాలా ఈజీగా అని ఆడవారు అంటుంటారు. ఏది ఏమైనా.. సంబంధాల విషయానికొస్తే సాధారణంగానే స్త్రీల తీరు పురుషులకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక అమ్మాయి తాను ప్రేమించే వ్యక్తికి, అతని సంపదను చూసి ఆకర్షితురాలవుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, అది ఏమాత్రం నిజం కాదని పరిశోధకులుు చెబుతున్నారు. ఎందుకంటే తన భాగస్వామి కోసం ఒక స్త్రీ తన ఆస్తినంతటినీ వదిలిపెట్టిన దాఖలాలు చాలానే ఉన్నాయని ఉదాహరణగా చూపుతున్నారు. మరీ ముఖ్యంగా ఒక అమ్మాయి తన భాగస్వామి నుంచి 4 అంశాలను కోరుకుంటుందట. మరి అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం.

1. బంధంలో అబద్ధాలకు చోటు ఇవ్వొద్దు..

ఏ సంబంధానికైనా పునాది సత్యం, నమ్మకం. అబద్ధాలు ఎంటరైతే.. ఆ బంధంలో చీలక వస్తుంది. ప్రతీ స్త్రీ తన భాగస్వామి తనను ఎప్పుడూ మోసం చేయకూడదని, జీవితాంతం తనతో నిజాయితీగా ఉండాలని కోరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

2. ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాలి..

ఒక అమ్మాయి తన భాగస్వామి తనకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగించాలని కోరుకుంటుంది. కేవలం ప్రశంసించడమే కాదు.. వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని కోరుకుంటారు.

3. సపోర్ట్ ఇవ్వాలి..

మహిళలు తమ భాగస్వామి నుండి ప్రేమను కోరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, గౌరవం లేకుండా ఆ ప్రేమ సంపూర్ణంగా ఉండదు. క్లిష్ట పరిస్థితుల్లో తన జీవిత భాగస్వామి తనను ఆదరించాలని, ఎన్ని కష్టాలు వచ్చినా అండగా ఉండాలని కోరుకుంటారు. అలా సపోర్ట్‌గా ఉండే వాళ్లతో చాలా సేఫ్‌గా భావిస్తారు.

4. సమయం కేటాయించాలి..

రిలేషన్‌షిప్‌లో ఒక స్త్రీ.. తన భాగస్వామితో సరదాగా గడిపేందుకు సమయాన్ని కోరుకుంటుంది. వాస్తవానికి పురుషులకు కెరీర్‌పై బాధ్యత పెరుగుతుంది. తద్వారా వారికి సమయం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఉన్న సమయంలోనే కొంత తమ భాగస్వామికోసం ప్లాన్ చేయాలి. బయటకు వెళ్లడం కుదరకపోతే.. ఇంట్లో కలిసి డిన్నర్ చేయడం, సినిమా కోసం ప్లాన్ చేయండి, మరేదైనా సరదాగా ప్లాన్ చేసుకోవాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..