AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Belly Fat : పొట్ట కొవ్వు దెబ్బకు ఇన్‌షర్ట్ వేయాలంటే భయపడుతున్నారా…ఈ టిప్స్ పాటిస్తే కొవ్వు ఐసులా కరిగిపోతుంది..

శరీరం ఫిట్‌గా ఉంటే, అది ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. బాడీ ఫిట్‌గా ఉండటం అంటే మీ శరీరంలో అదనపు కొవ్వు ఉండకపోవడం అని అర్థం. నేటి కాలంలో, బరువు పెరగడం అనేది అతి పెద్ద సమస్యలలో ఒకటి.

Belly Fat : పొట్ట కొవ్వు దెబ్బకు ఇన్‌షర్ట్ వేయాలంటే భయపడుతున్నారా...ఈ టిప్స్ పాటిస్తే కొవ్వు ఐసులా కరిగిపోతుంది..
Belly Fat
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 28, 2023 | 10:00 AM

Share

శరీరం ఫిట్‌గా ఉంటే, అది ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. బాడీ ఫిట్‌గా ఉండటం అంటే మీ శరీరంలో అదనపు కొవ్వు ఉండకపోవడం అని అర్థం. నేటి కాలంలో, బరువు పెరగడం అనేది అతి పెద్ద సమస్యలలో ఒకటి. స్థూలకాయానికి ప్రజలు వేగంగా బలైపోతున్నారు. బరువు తగ్గడం పెద్ద సమస్య కానప్పటికీ. పొట్ట కొవ్వు లేదా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి చాలా కష్టపడాలి. కడుపు బయటకు వస్తే అది మీ రూపాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. అందుకే వేలాడే కొవ్వును తగ్గించుకోవడానికి వర్కవుట్ తో పాటు ఆహారంతో పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయినప్పటికీ మీ కొవ్వు తగ్గకపోతే, కొన్ని హోం రెమెడీస్ పాటించడం ద్వారా మీరు మీ పొట్ట కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

వాము, జీలకర్ర:

వాము, జీలకర్ర ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరమైనవి. దీనితో పాటు, ఇది పొట్ట కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం, ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ జీలకర్ర, వాము కలపండి. రాత్రంతా నానబెట్టండి. తరువాత ఈ మిశ్రమాన్ని బాగా ఉడకబెట్టండి. ఇప్పుడు గ్లాసులో వడపోసి వేడి వేడిగా తాగాలి. దీన్ని రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల పొట్ట కొవ్వు చాలా త్వరగా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మ , పసుపు:

నిమ్మ , పసుపు పొట్ట కొవ్వును తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీని కోసం, సగం నిమ్మకాయ ముక్కను పిండి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి. అందులో చిటికెడు పసుపు కలపండి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వెంటనే ఫలితం కనిపిస్తుంది.

దాల్చిన చెక్క , తేనె:

దాల్చిన చెక్క కొవ్వును కరగించడంలో ఎంతో మేలు చేస్తుంది. దాల్చినచెక్క , తేనె కలపి తీసుకుంటే మీ పొట్టపై నిల్వ ఉన్న కొవ్వును వేగంగా తగ్గించడంలో వేగంగా పనిచేస్తుంది.

కలబంద:

అలోవెరా జ్యూస్ కూడా కొవ్వును తగ్గించడానికి సమర్థవంతమైన నివారణిగా చెప్పవచ్చు. ఇందుకోసం కలబంద రసాన్ని రోజూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని వారాల్లో కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి బరువును తగ్గించడంతో పాటు, పొట్టలోని కొవ్వును తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం, క్రమం తప్పకుండా రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి, ఆపై ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలపి తాగితే మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిల్క్ చేయండి,,