IIT Madras: స్టూడెంట్స్ నయా సృష్టి.. 30 సెకన్లలో పాలల్లో కల్తీని కనిపెట్టే సరికొత్త పరికరం.. అతితక్కువ ధరకే త్వరలో అందుబాటులోకి

ఈ సాంకేతికత పరికరం ఉపయోగించడం చాలా సులభం. ఇంట్లో కూర్చున్న వ్యక్తి  అయినా పాలలోని స్వచ్ఛతను సులభంగా కనుగొనవచ్చు. పాలను యూరియా, డిటర్జెంట్, సబ్బు, స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ వంటి వాటితో తయారు చేస్తూ.. కల్తీ పాలు తయారు చేసి మార్కెట్ లో అమ్మకం ఎక్కువైన సంగతి తెలిసిందే.

IIT Madras: స్టూడెంట్స్ నయా సృష్టి.. 30 సెకన్లలో పాలల్లో కల్తీని కనిపెట్టే సరికొత్త పరికరం.. అతితక్కువ ధరకే త్వరలో అందుబాటులోకి
మీరు కాకరకాయను తిన్న తర్వాత లేదా దాని రసం తాగిన తర్వాత పాలు తాగకూడదు. ఎందుకంటే ఇది మీకు కడుపుకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది.
Follow us
Surya Kala

|

Updated on: Mar 28, 2023 | 12:50 PM

రోజు రోజుకీ అన్ని వస్తువుల్లో అంటే మానవ నిర్మిత పదార్ధాల్లో మాత్రమే కాదు..  ప్రకృతి ప్రసాదిత ఆహారపదార్ధాల్లో కూడా కల్తీలు పెరిగిపోతున్నాయి. దీంతో మనిషి జీవన విధానం.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే కొంతమంది స్టూడెంట్స్  సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరంతో పాలల్లో జరిగే కల్తీని కొన్ని సెకన్లలోపే గుర్తించవచ్చు. వివరాల్లోకి వెళ్తే..

ఐఐటీ మద్రాస్‌కు చెందిన రీసెర్చ్ స్కాలర్లు పేపర్ ఆధారిత 3డీ పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ సహాయంతో పాలలో కల్తీని 30 సెకన్లలోపే గుర్తించవచ్చు. ఈ సాంకేతికత పరికరం ఉపయోగించడం చాలా సులభం. ఇంట్లో కూర్చున్న వ్యక్తి  అయినా పాలలోని స్వచ్ఛతను సులభంగా కనుగొనవచ్చు. పాలను యూరియా, డిటర్జెంట్, సబ్బు, స్టార్చ్, హైడ్రోజన్ పెరాక్సైడ్‌ వంటి వాటితో తయారు చేస్తూ.. కల్తీ పాలు తయారు చేసి మార్కెట్ లో అమ్మకం ఎక్కువైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పాలల్లో కల్తీని ఈ పరికరం సహాయంతో చాలా సులభంగా గుర్తించవచ్చు.

ఈ 3డి పరికరం చాలా చౌకైన ధరకు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకుని రానున్నారు. దీని సహాయంతో..  నీరు, రసం, ఇతర ఉత్పత్తులలో కల్తీని సులభంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు ప్రయోగశాలలో పాలలో కల్తీపై పరిశోధన  జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇది చాలా ఖరీదైనది అంతేకాదు ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ డవలప్ చేసిన  ఈ పరికరం తక్కువ ధరకే లభ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ పరికరం మూడు పొరలను కలిగి ఉంటుంది ఐఐటీ మద్రాస్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ మైక్రోఫ్లూయిడ్ పరికరం మూడు పొరలలో ఉంటుంది. శాండ్‌విచ్ లాగా ఈ రెండు పొరల మధ్య మధ్య పొర ఉంటుంది. ఈ పొర కల్తీని సులభంగా గుర్తిస్తుందని తెలిపారు. ఈ టెక్నాలజీ సహాయంతో కల్తీ తరంగాలను సులభంగా గుర్తించవచ్చని.. ఇప్పటివరకు మనం ఉపయోగించిన టెక్నాలజీ చాలా ఖరీదైనదని చెప్పారు. ఈ పరికరం మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తే.. ప్రజలు ల్యాబ్‌కు వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని అసలు, నకిలీల మధ్య తేడాను సులభంగా కనుగొనవచ్చు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో పానీయాల కల్తీ ఒక పెద్ద సమస్య అని.. దీని వల్ల ప్రజలు ఒక నిర్దిష్ట దశకు చేరుకోక ముందే కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారు. కల్తీ పాల కారణంగా చిన్నారుల మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అంతేకాదు ఈ కల్తీ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి.  ఈ పరిశోధన గురించి ప్రఖ్యాత సైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురించబడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..