Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Men Health: మగ మహారాజులు బీ అలర్ట్.. ఈ 5 అలవాట్లు ఉంటే మీ పని గోవిందా..!

అంగస్తంభన అనేది పురుషులకు లైంగికపరమైన సమస్యలు. లైంగిక కోరిక తగ్గడం, నపుంసకత్వం, లైంగిక శక్తి లేకపోవడం వంటి సమస్యలతో చాలామంది పురుషులు బాధపడుతున్నారు. వీటిల్లో మరో పెద్ద సమస్యగా ఫీల్ అయ్యేది పురుషాంగం పరిమాణం. కొన్ని అలవాట్లు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయడం, పురుషాంగం పరిమాణం తగ్గిపోవడానికి కారణమవుతాయట.

Men Health: మగ మహారాజులు బీ అలర్ట్.. ఈ 5 అలవాట్లు ఉంటే మీ పని గోవిందా..!
Health
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 27, 2023 | 8:00 AM

అంగస్తంభన అనేది పురుషులకు లైంగికపరమైన సమస్యలు. లైంగిక కోరిక తగ్గడం, నపుంసకత్వం, లైంగిక శక్తి లేకపోవడం వంటి సమస్యలతో చాలామంది పురుషులు బాధపడుతున్నారు. వీటిల్లో మరో పెద్ద సమస్యగా ఫీల్ అయ్యేది పురుషాంగం పరిమాణం. కొన్ని అలవాట్లు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయడం, పురుషాంగం పరిమాణం తగ్గిపోవడానికి కారణమవుతాయట. మరి ఈ సామర్థ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఏంటి? ఈ సమస్య నుంచి బయటపడే ఉపాయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వ్యాయామం చేయాలి..

ఓ మెడికల్ సర్వే ప్రకారం.. రోజూ వ్యాయామం చేసే పురుషుల్లో అంగస్తంభనలు, లైంగిక సామర్థ్యం మెరుగైన స్థితిలో ఉందని గుర్తించారు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం వల్ల పురుషాంగం పరిణామం కూడా ఎక్కువగా ఉంటుందట. రోజూ వ్యాయామం చేయడం వల్ల పురుషాంగానికి రక్త ప్రవాహం మెరుగవుతుంది. తద్వారా లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

చిగుళ్ల వ్యాధులు..

నోటిలోని చిగుళ్ల వాపు సమస్య కూడా పురుషుల లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపుతుందట. 1012లో ఓ సంస్థ చేసిన పరిశోధన ప్రకారం.. చిగుళ్ల కణజాలంలో ఉన్న బ్యాక్టీరియా శరీరం అంతా వ్యాపించే అవకాశం ఉంది. అలా జరగడం వల్ల పురుషాంగంలోని రక్తనాళాల వాయడం, దెబ్బతినడం జరుగుతుందట.

అనారోగ్యకరమైన ఆహారం తినడం..

అధిక బరువు కలిగి ఉండటం, ఫాస్ట్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన పదార్థాలను అధిక మొత్తంలో తీసుకోవడం కూడా పురుషాంగం పరిమాణంపై ప్రభావం చూపుతుందట. ఒక అధ్యయనం ప్రకారం.. క్రమం తప్పకుండా ట్రాన్స్ ఫ్యాట్స్ (కుకీలు, కేకులు, చాక్లెట్లు, చిప్స్, ఆయిల్, ప్రాసెస్ చేసిన ఆహారాలు) తినే పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత చాలా తక్కువగా ఉంటుందని తేలింది.

ఎక్కువ సిగరెట్లు..

సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల పురుషాంగం పరిమాణం గణనీయంగా తగ్గుతుందట. లైంగిక సామర్థ్యం దెబ్బతింటుందట. సిగరెట్ పొగలో ఉండే హానికరమైన పదార్థాలు రక్త నాళాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా అంగస్తంభన లోపం ఏర్పడుతుంది.

పండ్లు, కూరగాయలు తినకపోవడం..

యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పదార్థాలు రక్తనాళాలలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్‌‌ను తొలగిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ అర్జినైన్ సమ్మేళనం అంగస్తంభనను సమర్థవంతంగా చికిత్స చేస్తుంది.

గమనిక: పైన పేర్కొన్న వివరాలు సాధారణ ప్రయోజనాల కోసం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..