Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya Seeds: బొప్పాయి గింజలను పడేస్తున్నారా? ఇది తెలిస్తే ఒక్క గింజ కూడా వేస్ట్ చేయరు!

బొప్పాయి పండును తినని వారు ఉండరు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్లలో బొప్పాయి చెట్లు తప్పకుండా ఉంటాయి. బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. రుచికరమైన పండే కాకుండా, చాలా తక్కువ ధరకే లభించే, ఆరోగ్యకరమైన పండు కూడా. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, బొప్పాయి తినేటప్పుడు చాలా మంది దానిలోని గింజలను

Papaya Seeds: బొప్పాయి గింజలను పడేస్తున్నారా? ఇది తెలిస్తే ఒక్క గింజ కూడా వేస్ట్ చేయరు!
Papaya Seeds
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 27, 2023 | 9:30 AM

బొప్పాయి పండును తినని వారు ఉండరు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇళ్లలో బొప్పాయి చెట్లు తప్పకుండా ఉంటాయి. బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు ఉంటాయి. రుచికరమైన పండే కాకుండా, చాలా తక్కువ ధరకే లభించే, ఆరోగ్యకరమైన పండు కూడా. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, బొప్పాయి తినేటప్పుడు చాలా మంది దానిలోని గింజలను పడేస్తుంటారు. ఈ పండు చెట్టు కావాలనుకునే వారు మాత్రమే ఆ విత్తనాలను సేకరిస్తారు. అయితే, ఈ బొప్పాయి పండు మాదిరిగానే బొప్పాయి గింజలతోనూ బోలుడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బొప్పాయి గింజల యొక్క ప్రయోజనాలు..

బొప్పాయి గింజల రంగు నలుపు, అనేక రకాల పోషకాలు ఇందులో ఉంటాయి. నేరుగా తింటే చేదుగా ఉంటుంది. సాధారణంగా ఈ గింజలను ముందుగా ఎండలో ఎండబెట్టి, తర్వాత గ్రైండ్ చేసి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

1. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది..

భారతదేశంలో హృద్రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ ఎంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడమో, ఆస్పత్రిపాలవడమో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితిలో బొప్పాయి గింజలు సంజీవనికంటే అద్భుతంగా పని చేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ఈ విత్తనాల సహాయంతో రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు.

2. వాపు తగ్గుతుంది..

బొప్పాయి గింజలు వాపును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ గింజల్లో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఉండే వాపు నయమవుతుంది.

3. చర్మానికి మంచిది..

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. బొప్పాయి గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీయేజ్ గుణాలు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం నిపుణులు తెలిపిన, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలుంటే ముందుగా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..