Karnataka Election 2023 Date: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం..
Election Commission Press Conference: భారత ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్‌ను ప్రకటించింది. మే24తో కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
![Karnataka Election 2023 Date: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/karnataka-1.jpg?w=1280)
Election Commission Press Conference: భారత ఎన్నికల సంఘం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్‌ను ప్రకటించింది. మే24తో కర్ణాటక ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పొలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. నేటి నుండే కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఈసీ ఈ సందర్భంగా ప్రకటించింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 13న ఎన్నికల నొటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ 20, నామినేషన్ల పరిశీలన 21, నామినేషన్ల ఉపసంహరణకు 24 వ తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.
![Karnataka](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/karnataka-2.jpg)
Karnataka
తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం..
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తీసుకువచ్చింది. సీనియర్ సిటిజన్లు ఇంటినుంచే ఓటువేసే అవకాశాన్ని కల్పించింది. 80ఏళ్లు పైబడిన వృద్ధులు ఇంటి దగ్గరే బ్యాలెట్ విధానంలో ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పించారు. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల ఓటర్లు ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఓటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/relationship-tips-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/relationships.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/relation-1.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/02/libido.jpg)
Karnataka Assembly elections will be held on 10th May; counting of votes on 13th May pic.twitter.com/SYcfTnFnDB
— ANI (@ANI) March 29, 2023
గట్టి నిఘా..
ఎన్నికల్లో ధనబలం వాడకాన్ని అరికట్టేందుకు కర్ణాటకలో తమ బృందాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఈసీ తెలిపింది.. గట్టి నిఘా ఉంచేందుకు 2400 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు. 19 జిల్లాల్లోని 171 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులపై పర్యవేక్షణ చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
We are strengthing our team in Karnataka to curb the use of money power in elections. 2400 Static Surveillance teams to keep strict vigil. Monitoring on 171 Interstate check posts in 19 districts (sharing borders with other states): Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/p46neonh88
— ANI (@ANI) March 29, 2023
18 ఏళ్లు దాటినవారందరికీ ఓటు..
కర్నాటకలో 2018-19 లో 9.17 లక్షల ఓటర్లు పెరిగారని.. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లందరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయగలరని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,21,73,579 మంది నమోదిత ఓటర్లు ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 58,282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
కర్ణాటకతోపాటు ఒడిశా, యూపీ, మేఘాలయ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్యే సీట్లకు, పంజాబ్‌లో జలంధర్ (ఎంపీ సీటు)కు ఉప ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
కర్ణాటక అసెంబ్లీలో ఉన్న 224 సీట్లలో ప్రస్తుతం అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 75, దాని మిత్రపక్షమైన జేడీ(ఎస్)కి 28 సీట్లు ఉన్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..