UPI Frauds: మొబైల్‌ పేమెంట్‌ యాప్‌లతో జాగ్రత్త.. యూజర్ల నుంచి రూ.కోట్లు దోచేస్తున్న కేటుగాళ్లు

కోవిడ్ మహమ్మారి వల్ల దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌లను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం..

UPI Frauds: మొబైల్‌ పేమెంట్‌ యాప్‌లతో జాగ్రత్త.. యూజర్ల నుంచి రూ.కోట్లు దోచేస్తున్న కేటుగాళ్లు
UPI Scam
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2023 | 1:42 PM

కోవిడ్ మహమ్మారి వల్ల దేశంలో ఆన్‌లైన్ చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌లను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఫిబ్రవరి 2022లో యూపీఐ ద్వారా నిర్వహించే రోజువారీ లావాదేవీలు 24 కోట్ల నుంచి 36 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. మొబైల్ పేమెంట్ యాప్‌లను ఉపయోగించే యూజర్లను బోల్తా కొట్టించి కోట్లాదిసొమ్మును కొల్లగొడుతున్నారు. తాజాగా ముంబైలోని 81 మంది యూపీఐ యూజర్ల నుంచి కేటుగాళ్లు దాదాపు కోటి రూపాయలు దోచేశారు. చెల్లింపుల సమయంలో చేసే ‘పేమెంట్‌ మిస్టేక్‌’ల ద్వారా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మాల్వేర్ ఫిషింగ్, హ్యూమన్ ఇంజినీరింగ్‌ టెక్నాలజీలతో చేస్తున్న మోసాల నుంచి మొబైల్ చెల్లింపులు చేస్తున్న యూజర్లను సంరక్షించేందుకు ఇప్పటికే వినియోగిస్తున్న యాంటీ-మాల్వేర్ సాఫ్ట్‌వేర్ సరిపోవడం లేదని నిపుణులు అంటున్నారు.

గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యూపీఐ అప్లికేషన్‌లను ఉపయోగించి నగదుపంపే యూజర్లకు స్కామర్లు ఫోన్లు చేసి, వారు పంపిన డబ్బు పొరపాటుగా వేరే ఖాతాకు బదిలీ అయ్యిందని, పొరపాటును సరిచేసేందుకు ఫోన్‌ నంబర్‌తోపాటు ఇతర వివరాలను సేకరించి వారి ఖాతాను హ్యాక్‌ చేస్తున్నారు. బాధితులు మరొకమారు నగదు చెల్లింపులు చేసే సమయంలో వారి ఫోన్‌లోని బ్యాంక్ అకౌంట్‌ సమాచారం, పాన్‌ నంబర్‌, ఆధార్, కేవైసీతో సహా మొత్తం డేటా స్కామర్ల చేతిలోకి వెళ్తుంది. ఈ డేటాతో యూజర్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి నేరుగా నగదును దోచేస్తారని ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ ఎక్స్‌పర్ట్‌ పవన్ దుగ్గల్ పేర్కొన్నారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు స్పందించకపోవడం, తమ బ్యాంకు ఖాతాకు సంబంధించిన సమాచారం ఎవరితో పంచుకోకపోవడం వల్ల కొంత వరకు సైబర్‌ నేరాలను అరికట్టవచ్చని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

యూపీఐ మోసాల నుంచి ఇలా జాగ్రత్తపడండి..

  • విశ్వసనీయ యూపీఐ యాప్‌ని ఉపయోగించడం
  • స్ట్రాంగ్‌ పిన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసుకోవడం
  • యూపీఐ పిన్‌ను ఎవరితో షేర్ చేసుకోకపోవడం
  • అపరిచిత ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండటం
  • యూపీఐ యాప్‌ను అప్‌డేట్‌గా ఉంచుకోవడం
  • లావాదేవీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండటం

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌