Warangal: ‘నాన్నా.. ఉంగరం కూడా పోయింది.. నాకు భయమేస్తోంది’ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

వేలికున్న బంగారు ఉంగరం పోయిందనే మనస్తాపంతో డిగ్రీ విద్యార్ధిని తనువు చాలించింది. పోయిన ఉంగరం ఎంత వెదికినా దొరక్కపోవడంతో నాన్న మన్నించు అంటూ ఉత్తరం రాసి ఇంట్లోనే ఉరివేసుకుని కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది. ఈ విషాద ఘటన వరంగల్‌ జిల్లాలో..

Warangal: 'నాన్నా.. ఉంగరం కూడా పోయింది.. నాకు భయమేస్తోంది' డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Warangal Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 29, 2023 | 9:22 AM

వేలికున్న బంగారు ఉంగరం పోయిందనే మనస్తాపంతో డిగ్రీ విద్యార్ధిని తనువు చాలించింది. పోయిన ఉంగరం ఎంత వెదికినా దొరక్కపోవడంతో నాన్న మన్నించు అంటూ ఉత్తరం రాసి ఇంట్లోనే ఉరివేసుకుని కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది. ఈ విషాద ఘటన వరంగల్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం (మర్చి 28) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామానికి చెందిన మద్దుల జానకి రాములు, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హేమలతారెడ్డి(19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతుంది. చిన్న కుమార్తె అశ్విత మరిపెడలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుంది. ఉగాది పండగకు హేమలతారెడ్డి మార్చిన 20న ఇంటికొచ్చింది. ఈక్రమంలో చేతికున్న పావుతులం గోల్డ్‌ రింగ్‌ బుధవారం నాడు హేమలత ఎక్కడో జారవిడుచుకుంది. ఇల్లంతా వెతికినా దొరక్కపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. 6 నెలల క్రితం మెడలోని గోల్డ్‌ చైన్‌ కూడా పోగొట్టుకున్నానని, ఇప్పుడు ఉంగరం కూడా పోవడంతో తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో సూసైడ్‌ లెటర్ రాసి ఇంట్లోనే చున్నీతో ఉరిపెట్టుకుని ఆత్మహత్య చేసుకుంది.

పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తలుపులు లోపల్నుంచి గడిపెట్టి ఉండటంతో అనుమానం కలిగింది. దీంతో బలంగా తలుపులు తెరిచి ఇంట్లోకెళ్లి చూడగా ఉరి వేలాడుతున్న కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలి ఫోన్‌తోపాటు, సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై జగదీష్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రూ.5 కోట్లు పెట్టి 54 కోట్లు సంపాదించిన హీరోయిన్..
రూ.5 కోట్లు పెట్టి 54 కోట్లు సంపాదించిన హీరోయిన్..
ఓర్నీ... ఇంకో జన్మంటూ ఉంటే..ఇలా కుక్కలా పుట్టాలి..
ఓర్నీ... ఇంకో జన్మంటూ ఉంటే..ఇలా కుక్కలా పుట్టాలి..
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బ్రోకోలి.. వారంలో ఒక్కసారైనా
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
ఓర్నాయనో.. ఇలా తయారయ్యారెంట్రా.. జాబ్ పేరిట మహిళకు ఫోన్.. చివరకు
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
6 ఏళ్ల రికార్డ్‌పై కన్నేసిన దమ్మున్నోడు.. కెరీర్‌లో తొలిసారి
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
భార్యను పరిచయం చేసిన హీరో శ్రీసింహ..
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
తెల్ల పసుపు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు చూస్తే..
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా
మరో చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల ఐపీఎల్ సెన్సెషన్.. మాములోడు కాదుగా