గృహ హింస కేసుల్లో తెలంగాణది రెండో స్థానం.. కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే..

గృహ హింసలో భార్య లే కాదు.. తల్లులు సైతం హింసలు అనుభవిస్తున్నారంటున్నారు మహిళా హక్కుల నేతలు. మహిళా కమిషన్ లాంటి సంస్థలు ప్రధానంగా పెరుగుతున్న కేసులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఖచ్చితంగా పెరుగుతున్న గృహ హింస కేసులపై చర్చ జరగాలి. అది ఇంటి నాలుగు గోడల పరిధి దాటి వెళ్లాలి అంటున్నారు.

గృహ హింస కేసుల్లో తెలంగాణది రెండో స్థానం.. కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే..
Domestic Violence
Follow us

|

Updated on: Mar 28, 2023 | 7:39 PM

మహిళలకు ఇంటా బయటా అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రత్యేకంగా ఇంట్లో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. అందులో అత్తింటి ఆరళ్లు హద్దులు దాటుతున్నాయి. ఈ పరిధి తెలుగురాష్ట్రల్లో మరింత దారుణంగా తయారైంది. అందులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే డొమిస్టిక్ వైలెన్స్ లో రెండో స్థానంలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. దేశంలో నానాటికీ గృహహింస కేసుల్లో 50. 4 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. అసోం 75 శాతం కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా, ఢిల్లీ 48.9 శాతంతో మూడో స్థానంలో ఉంది. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా’ సర్వేలో గృహ హింసకేసుల పరిస్థితిని వెల్లడించింది. దీనికి నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్సు గణాకాంకాలు కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తున్నాయి.

దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో మూడో వంతు కట్టుకున్న భర్త, అతని బంధువులు నుంచే ఎదురవుతున్నాయి. ఉద్దేశపూర్వక దాడులు, కిడ్నాప్, అత్యాచార ప్రయత్న ఘటనలు.. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఈ రకమైన వేధింపులు 2015-16లో 33.3 శాతం ఉండగా.. 2019-21 నాటికి కొద్దిగా తగ్గి 31. 9 శాతానికి చేరాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నట్లు సర్వే లో వెల్లడవుతోంది.

దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు సంబంధించి గత ఏడాది చివరికి నాటికి కోర్టుల్లో 21.22 లక్షల కేసు ఉంటే.. ఇప్పటి వరకు 89,538 కేసులు పరిష్కారమయ్యాయి. మరో వైపు 2005 నుంచి తాజా కేసుల వరకూ అనేక వేధింపుల కేసుల్లో మహిళలు చేసుకుంటున్న ఆత్మ హత్యలు కూడా ఆందోళన కల్గిస్తున్నాయి. 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, ఇది 2011 నాటికి 47,746కు పెరిగింది. 2021 నాటికి 45,026 మంది దేశ వ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే హింస, హింస భరిరంచలేక ఆత్మహత్యల కేసుల్లో రెండో స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండటం ఆందోళన కల్గిస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రధానంగా ఇంట్లోనే మహిళలు వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతోంది. 2016లో భర్త, అతడి బంధు వుల నుంచి ఎదుర్కొన్న సమస్యలపై 1,10,378 ఘటనలు ఉండగా, ఇవీ 2021 నాటికి 1,36,234గా నమోదయ్యాయి. ఇక అత్యాచార ఘటనలు 2016లో 38,947 ఉండగా, 2021 నాటికి 31,677గా నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు 2016లో 64,519 ఉండగా, 2021 నాటికి 75,389గా ఉన్నాయి. ఉద్దేశపూర్వక వేదింపులు, లైంగిక వేధింపుల ఘటనలు 2016లో 84,746 ఉండగా, 2021 నాటికి 89,200కు చేరాయి. వరకట్న వేధింపుల ఘటనలు సైతం పెరుగుతున్నాయి. ఇవి 2016లో 9,683 ఉండగా, 2021 నాటికి 13,568కు చేరాయి. మొత్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు 2016లో 3,38,954 ఉండగా, ఇది 2021 నాటికి 4,28,278కి చేరాయి. ఇక ఇప్పటికీ బాల్య వివాహాలూ జరుగుతున్నాయని, వీటిల్లో బీహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 40 శాతంతో ముందున్నట్లు సర్వే వెల్లడిస్తోంది. అయితే.. మహిళలపై జరుగుతున్న నేరాల శాతంలోనూ తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో ఉంది.

తెలంగాణ లోని గుండాల ప్రాంతానికి చెందిన ఒక గృహ హింస, హత్య కేసులో భర్త తో పాటు కుటుంబ సభ్యులకు న్యాయ స్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదని, ప్రారంభమైన వేధింపులు చివరకు ఉమ అనే గృహిణి ప్రాణాలు కోల్పోయింది. భర్త సురేష్‌ కుటుంబ సభ్యులు గొంతు నులుమి హత్య చేసినట్లు కోర్టు నిర్థారించింది. ఇది తాజాగా వెల్లడైన కేసు. ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఇంకా అనేకం కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరిగినట్లు కనిపించడానికి అనేక కారణాలలో అవేర్ నెస్ కూడా కారణమంటోంది తెలంగాణ మహిళా భద్రతా విభాగం. మరోవైపు గృహ హింస గణాంకాలు ను పరిశీలిస్తే కరోనా కాలంలో ఎక్కవు పెరగినట్లు గుర్తించామంటోంది. దీనికి కారణాలు కూడా గుర్తించామంటోంది వర్క్ ఫ్రం హోమ్ పెరగటం, చాలా సెక్టార్లలో ఉద్యోగాలు తొలగింపు, ఎక్కువ శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోవడం కారణమయ్యాయంటున్నారు తెలంగాణ మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్. మరోవైపు ఇగో క్లాసెస్, భార్యా భర్తల వివాదాల మధ్య కుటుంబ సభ్యులు, బయటి వ్యక్తుల ఇన్‌ వాల్వమెంట్ కారణమవుతున్నాయంటున్నారు.

తెలంగాణలో డొమిస్టిక్ వైలెన్స్ పెరిగి దేశంలో రెండో స్థానానికి చేరడానికి చట్టం సరిగ్గా అమలు కాకపోవడమే కారణం అంటున్నాయి మహిళా సంఘాలు. మరోవైపు పోలీసులు ఫోకస్ట్ గా పనిచేయడం లేదంటున్నాయి. షీ టీమ్స్, భరోసా లాంటివి ఏర్పాటు చేసినా సమర్థ వంతంగా పనిచేయడం లేదని ఆరోపిస్తున్నాయి. జరుగుతున్న ఘటనల నేపథ్యంలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉందంటున్నాయి. ఇది లేకపోవడం వలన ప్రతి ఏటా కేసులు సంఖ్య పెరగుతునే పోతోందని అంటున్నాయి.

పెళ్లికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ విధానం ఉండాల్సిన అవసరం ఉంది. మరో వైపు వివాహ సంబంధాల్లో , కుంటుంబ సంబంధాల్లో సమస్యలు వేస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధానంగా ఇవి లేకపోవడం వల్ల గృహ హింస లో మిస్ గైడెన్స్ ఎక్కువగా కొసాగుతోందంటున్నారు ఈకేసులను చూస్తున్నఅథంటిక్ సంస్థల ప్రతినిధులు. దీనివల్ల కేసులు.. కోర్టు లు తప్ప .. సత్వరం న్యాయం జరగడం లేదు. తల్లితండ్రుల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. విడాకులనే వారు ఎక్కువగా అనేక కేసుల్లో ప్రోతహిస్తున్నారంటున్నారు డాక్టర్ మమత. బైట్ః డాక్టర్ మమతా రఘువీర్, డైరెక్టర్, మహిళా భద్రతా విభాగం. తెలంగాణ ప్రభుత్వం

మగాళ్లలో మార్పు రావాల్సిన అవసరం ఉందటున్నాయి మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంఘాలు. పితృ స్వామికం భావజాలం, ఆర్థికం వంటి అంశాలకు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న మద్యం కూడా ఒకకారణమే అంటున్నాయి. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని చూస్తుందే తప్ప…. దాని వల్ల హింస పెరుగుతోందని ప్రభుత్వం గుర్తించడం లేదంటున్నాయి. గృహ హింసలో భార్య లే కాదు.. తల్లులు సైతం హింసలు అనుభవిస్తున్నారంటున్నారు మహిళా హక్కుల నేతలు. మహిళా కమిషన్ లాంటి సంస్థలు ప్రధానంగా పెరుగుతున్న కేసులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఖచ్చితంగా పెరుగుతున్న గృహ హింస కేసులపై చర్చ జరగాలి. అది ఇంటి నాలుగు గోడల పరిధి దాటి వెళ్లాలి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..

చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే