Tirupati Temple Fined: వడ్డీ కాసుల వాడికి తప్పని జరిమానా..! రూ. 4.33 కోట్ల ఫైన్‌ విధించిన ఆర్బీఐ..కారణం ఏంటంటే..

గత 5 ఏళ్లలో టీటీడీకి హుండీ ద్వారా దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ రాగా ఈ నగదు మార్పిడి కోసం ప్రయత్నించిన టిటిడి ఈ నగదు ఎవరిచ్చారు, ఎలా తీసుకున్నారని ఆర్బీఐ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక పోయింది. గుర్తు తెలియని అజ్ఞాత భక్తులు హుండీలో వేసే కానుకలు కావడంతో ఎవరిచ్చారో గుర్తించడం సాధ్యం కాదని తేల్చింది.

Tirupati Temple Fined: వడ్డీ కాసుల వాడికి తప్పని జరిమానా..! రూ. 4.33 కోట్ల ఫైన్‌ విధించిన ఆర్బీఐ..కారణం ఏంటంటే..
Tirupati Temple
Follow us

|

Updated on: Mar 28, 2023 | 5:46 PM

తిరుమల శ్రీవారి విదేశీ కానుకల వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. 2018 నుంచి టీటీడీ వద్ద నిల్వ ఉన్న భక్తులు హుండీలో సమర్పించిన విదేశీ కరెన్సీ కి టిటిడి జరిమానా కట్టింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో టీటీడీ ఖాతాలోకి జమ కాని దాదాపు రూ.30 కోట్లకు జరిమానా కట్టాల్సి వచ్చింది. లైసెన్సు లేకపోయినా విదేశీ కానుకలు పొందడాన్ని ఆర్బీఐ తప్పుపట్టింది. విదేశీ కానుకల సేకరణ, వివరాలను సమర్పించలేక పోయిన టిటిడికి ఇప్పటికే రెండుసార్లు జరిమానా విధించడంతో ఎఫ్సీఆర్ఏ కు రూ.3 కోట్ల జరిమానా చెల్లించినట్లు టిటిడి స్పష్టం చేస్తోంది. శ్రీవారి హుండీ లో మూలుగుతున్న విదేశీ కరెన్సీ సమస్య పరిష్కారానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఇలా వడ్డీ కాసుల వాడే ఇప్పుడు అపరాధరుసుం చెల్లించాల్సి వచ్చింది. విదేశీ కరెన్సీ నిల్వ ఉంచుకున్న టీటీడీకి జరిమానా చెల్లించడం అనివార్యమైంది. విదేశీ కానుకల విషయంలో టిటిడి కి రూ.3 కోట్లు ఫైన్ వేసిన కేంద్రం ఎఫ్సీఆర్ఎ లైసెన్సు రెన్యువల్ చేసుకోని వైనాన్ని ఎత్తి చూపింది. దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ టిటిడి ఖాతాకు ఎస్బీఐ జమ చేయలేక పోయింది. ప్రతిఫలంగానే జరిమానా కట్టాల్సి వచ్చింది.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్ చేసుకోని కారణంగా కేంద్ర హోం శాఖ రూ.3 కోట్ల జరిమానా విధించింది. లైసెన్సు రెన్యువల్ చేసుకోని కారణంగా శ్రీవారికి భక్తులు హుండీ కానుకల కింద చెల్లించిన విదేశీ కరెన్సీ రూ.30కోట్ల మేరకు టీటీడీ ఖాతాలో డిపాజిట్ కాకుండా ఎస్బీఐ వద్ద మూలుగుతోంది. లైసెన్స్ రెన్యువల్ కాకపోవడంతో మారకానికి ఆర్బీఐ అంగీకరించక పొవడంతో ఈ సమస్య తలెత్తింది. తిరుమల శ్రీవారికి హుండీలో వేసే నగదు, ఖరీదైన ఇతర వస్తువులకు భక్తులు ఎలాంటి లెక్కలూ చెప్పాల్సిన పనిలేక పోగా భారీ మొత్తాల్లో ఆజ్ఞాత భక్తులు నగదు వేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగానే కొనసాగుతోంది.

ఇలా విదేశాల నుంచి వడ్డీ కాసుల వాడి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుండగా ఇలా పలు దేశాల కరెన్సీని ఆర్బీఐ ద్వారా టీటీడీ నగదు గా పొందేది. మన కరెన్సీలోకి మార్చుకునేది. 2018 తర్వాత అలా మారకానికి ఆర్బీఐ అంగీకరించక పోగా విదేశీ కరెన్సీని ఎస్బీఐ టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేయడానికి ఒప్పుకొని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా 2018 నుంచీ ఇప్పటి వరకు సుమారు రూ.30 కోట్ల మేరకు విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో జమ కాకుండా ఎస్బీఐ వద్ద మూలుగుతోంది.

ఇవి కూడా చదవండి

విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించడానికి టీటీడీ కేంద్ర హోం శాఖ నుంచి ఎఫ్సీఆర్ఎ చట్టం కింద లైసెన్సు పొందిన టిటిడి 2018 వరకూ ఇలాంటి ఇబ్బంది లేకుండా విదేశీ కరెన్సీ మారకానికి ఆర్బీఐ అనుమతించింది. ఎస్బీఐ కూడా విదేశీ కరెన్సీని టీటీడీ ఖాతాలో డిపాజిట్ చేస్తూ రాగా 2018లో లైసెన్సు గడువు ముగిసింది. దాని రెన్యువల్ పై దృష్టి సారించని టిటిడి నిర్లక్ష్యాన్ని కేంద్ర హోం శాఖలోని ఎఫ్సీ ఆర్ఎ విభాగం 2019లో గుర్తించింది. లైసెన్సు లేకపోయినా టీటీడీ విదేశీ విరాళాలు సేకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రూ.1.14 కోట్ల జరిమానా విధించింది. ఎఫ్సీఆర్ఎ చట్టానికి 2020లో చేసిన సవరణల ప్రకారం విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు వినియోగించుకోకూడదన్న నిబంధన కూడా అమల్లో ఉండగా టీటీడీ వినియోగించుకోవడం పై కేంద్రం అభ్యంతరం చెప్పింది. టీటీడీ అందజేసిన ఆదాయ వివరాలను కూడా సరైన రీతిలో లో సక్రమమైన ఫార్మాట్ లో ఇవ్వలేదన్న విషయాన్ని నిర్ధారించింది. ఈ మేరకు మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. ఇలా రెండుసార్లు జరిమానా మొత్తం రూ.4.33 కోట్లకు చేరుకోగా టీటీడీ రెన్యువల్ అంశం చర్చగా మారింది. కేంద్రంతో సంప్రదింపులు జరపడం మినహా సమస్యకు పరిష్కారం చూపని టిటిడి వైఖరి కేంద్ర హోం శాఖ నిర్దేశించినట్లుగా ఎఫ్సీఆర్ఎ చట్టం నియమ నిబంధనలను పాటించకపోయింది. దీంతో కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్ఎ విభాగానికి రూ.3 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చిన విషయాన్ని టిటిడి అంగీకరించింది. ఈ విషయాన్ని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

విదేశీ కరెన్సీని విరాళాలుగా స్వీకరించేందుకు కేంద్రం నుంచి టీటీడీ పొందిన లైసెన్సు 2018కు ముందే నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో రద్దు చేసినట్లు తెలిపింది. గత 5 ఏళ్లలో టీటీడీకి హుండీ ద్వారా దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ రాగా ఈ నగదు మార్పిడి కోసం ప్రయత్నించిన టిటిడి ఈ నగదు ఎవరిచ్చారు, ఎలా తీసుకున్నారని ఆర్బీఐ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక పోయింది. గుర్తు తెలియని అజ్ఞాత భక్తులు హుండీలో వేసే కానుకలు కావడంతో ఎవరిచ్చారో గుర్తించడం సాధ్యం కాదని తేల్చింది. అయినా కేంద్ర హోంశాఖ అధికారులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంప్రదింపులు జరుపుతుండగా టీటీడీ వ్యాపార కేంద్రం కాదని, ఒక ధార్మిక క్షేత్రమని భక్తులు భక్తితో కానుకలు సమర్పిస్తారని వివరించింది. జరిమానాలో రూ.3 కోట్ల మొత్తాన్ని టీటీడీ చెల్లించగా సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారమయ్యేలా చర్యలు వేగవంతం చేసింది.