5

17ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు సంచలనం.. మాఫియా డాన్‌, మాజీ ఎంపీకి జీవిత ఖైదు..

తనను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారని అంతకుముందు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని అతిక్‌ అహ్మద్‌కు సూచించింది సుప్రీంకోర్టు. కోర్టులో అతిఖ్‌ అహ్మద్‌తో పాటు మిగతా నిందితులను ప్రవేశపెట్టినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. లాయర్లు కోర్టులో నిరసన తెలిపారు.

17ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు సంచలనం.. మాఫియా డాన్‌, మాజీ ఎంపీకి జీవిత ఖైదు..
Umesh Pal Case
Follow us

|

Updated on: Mar 28, 2023 | 3:56 PM

ఉమేశ్‌పాల్‌ కిడ్నాపింగ్‌ కేసులో యూపీ మాఫియా డాన్‌, మాజీ ఎంపీ అతిఖ్‌ అహ్మద్‌కు జీవితఖైదు విధించింది న్యాయస్ధానం. ప్రయాగ్‌రాజ్‌ కోర్టులో అతిఖ్‌తో పాటు 10 మంది నిందితులను గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపర్చారు.అయితే, అతిఖ్‌తో పాటు ముగ్గురిని మాత్రమే దోషులను తేల్చింది న్యాయస్థానం. మిగతా ఏడుగురిని నిర్ధోషులుగా ప్రకటించింది. ముగ్గురు దోషులకు కఠిన జీవిత ఖైదుతో పాటుగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించింది కోర్టు. ఈ జరిమానా మొత్తాన్ని ఉమేష్ పాల్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

17 ఏళ్ల నాటి కేసులో అతిఖ్‌ అహ్మద్‌కు జీవితఖైదు విధించింది కోర్టు. అతిక్‌ అహ్మద్‌ సోదరుడు ఖలీద్‌ అజీంను ఈ కేసులో నిర్ధోషిగా ప్రకటించింది న్యాయస్దానం. తనకు ప్రాణహానీ ఉందని అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు అతిఖ్‌ అహ్మద్‌. అతిఖ్‌అహ్మద్‌ను కోర్టులో హాజరపర్చడానికి గుజరాత్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ తీసుకొచ్చారు యూపీ పోలీసులు. తనను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తారని అంతకుముందు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశాడు. అయితే అలహాబాద్‌ హైకోర్టుకు వెళ్లాలని అతిక్‌ అహ్మద్‌కు సూచించింది సుప్రీంకోర్టు. కోర్టులో అతిఖ్‌ అహ్మద్‌తో పాటు మిగతా నిందితులను ప్రవేశపెట్టినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. లాయర్లు కోర్టులో నిరసన తెలిపారు.

ఇవి కూడా చదవండి

2005లో జరిగిన రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ హత్యకు అహ్మద్, అష్రఫ్‌లు కూడా కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. బీఎఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అతీక్ అహ్మద్. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షి ఉమేష్‌పాల్‌కు సంబంధించిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 2006 ఫిబ్రవరి 28న అతిక్ అహ్మద్, అష్రఫ్ ఉమేష్ పాల్‌ను కిడ్నాప్ చేశారు. ఉమేష్ పాల్‌ను కొట్టి, అతని కుటుంబంతో కలిసి చంపేస్తానని బెదిరించి, కోర్టులో బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేశారు. 2007లో మాయావతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జూలై 5, 2007న, ఉమేష్ పాల్ అతిక్ మరియు అష్రఫ్‌తో సహా ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పోలీసుల విచారణలో మరో ఆరుగురి పేర్లు తెరపైకి వచ్చాయి.

అతిక్, అష్రఫ్ సహా 11 మందిపై కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2009లో ప్రారంభమైంది. ప్రాసిక్యూషన్‌ నుంచి అంటే ప్రభుత్వం తరఫున మొత్తం 8 మంది సాక్షులను హాజరుపరిచారు. ఈ కేసులో 11 మంది నిందితుల్లో అన్సార్ బాబా అనే నిందితుడు చనిపోయాడు. అతీక్, అష్రఫ్ సహా మొత్తం 10 మంది నిందితులపై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ..