Telugu News Trending The video of the leopard saluting the sun went viral Telugu News
Viral Video: యోగాతో అదరగొడుతున్న చిరుత..! సూర్య నమస్కారాలు చేస్తున్న వీడియో వైరల్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందారా షేర్ చేశారు. రష్యాలోని జాతీయ చిరుతపులి పార్కులో ఈ వీడియో రికార్డయిందని తెలిపారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు.
యోగా అనేది మనసును, శరీరాన్ని మన నియంత్రణలో ఉంచుకునేందుకు ఉపయోగపడే ఒక చక్కటి సాధనం. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం వల్ల శారీరక సమతుల్యతను మెరుగుపరచటమే కాకుండా ఒత్తిడి, ఆందోళన లక్షణాలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ డిజార్డర్, స్కిజోఫ్రెనియాతో సహా ఇతర మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో యోగా ఒక సహజమైన థెరపీలాగా ఉపయోగపడుతుంది. నిరాశ, నిద్రలేమితో బాధపడేవారు యోగాభ్యాసాలు చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. తమలోని చింతలన్నింటినీ మరచిపోవటానికి లోతైన శ్వాస తీసుకోవటం ద్వారా శరీరం, మనస్సు రెండింటినీ రిలాక్స్ చేసుకుంటారు. విశ్రాంతి తీసుకుంటారు. అలాగే, మనిషి మానసికంగా చికాకుగా ఉన్నప్పుడు లేదంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది యోగాసనాన్ని అభ్యసిస్తారు. అయితే జంతువులు యోగా చేయడం ఎప్పుడైనా చూశారా? ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో చిరుతపులి సూర్యనమస్కారాలు చేస్తున్న దృశ్యం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
వైరల్ వీడియోలో, చిరుతపులి నిద్ర నుండి మేల్కొని ప్రశాంతంగా యోగాసానాలు వేస్తోంది. చిరుత శరీరం వంచుతున్న దృశ్యం యోగా తెలిసిన వారికి చిరుతపులి కూడా లేచి నిలబడి సూర్య నమస్కారాలు చేస్తుందని అర్థం అవుతుంది. సూర్య నమస్కారమో, సోమరితనంతో ఒళ్లు విరుచుకుంటుందో వీడియో చూశాక మీరే చెబుతారు. కానీ, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందారా షేర్ చేశారు. రష్యాలోని జాతీయ చిరుతపులి పార్కులో ఈ వీడియో రికార్డయిందని తెలిపారు.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. విపరీతంగా లైకులు, షేర్లు చేస్తున్నారు.