Watch Video: మన్కడింగ్‌తో ఔట్.. కట్‌చేస్తే.. మైదానంలోనే ‘డర్టీ పిక్చర్’ చూపించిన బ్యాటర్.. వైరల్ వీడియో..
Trending Video: ఈ రూల్ వచ్చినా.. బ్యాటర్లు మాత్రం మారడం లేదు. బౌలర్లపై కోపంతో ఊగిపోతూ.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది.
Viral Video: క్రికెట్‌లో మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో ఐసీసీ ఈ మేరకు కొత్త చట్టం తీసుకొచ్చింది. అసలు మన్కడింగ్ అంటే ఏంటో ఓసారి చూద్దాం.. బౌలర్ బంతిని విసరకముందే నాన్‌స్ట్రైక్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ క్రీజు దాటితే ఔట్ చేసే అవకాశం బౌలర్‌కు ఉంటుంది. అయితే, దీనిని ఇంతకుముందు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా పరిగణించేవారు. ఐసీసీ కొత్త రూల్ తీసుకరావడంతో రనౌట్‌గా పరిగణిస్తున్నారు. ఈ రూల్ వచ్చినా.. బ్యాటర్లు మాత్రం మారడం లేదు. పైగా బౌలర్లపై కోపంతో ఊగిపోతున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో సందడి చేస్తోంది.
టాస్మానియన్ సదరన్ క్రికెట్ అసోసియేషన్ (SCA) మొదటి గ్రేడ్ ఫైనల్ క్లార్‌మాంట్, న్యూ నార్ఫోక్ మధ్య జరిగింది. ఫైనల్ మ్యాచ్ సమయంలో క్లేర్‌మాంట్ బ్యాట్స్‌మెన్ జెరోడ్ కేయ్ మైదానంలో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడు. న్యూ నార్ఫోక్ బౌలర్ హ్యారీ బూత్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జెరోడ్ కేయ్‌ను మన్కడింగ్‌తో రనౌట్ చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయాడు.
న్యూ నార్ఫోక్ క్లేర్‌మాంట్‌కు 50 ఓవర్లలో 263 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్లేర్‌మాంట్‌కు చెందిన జెరోడ్ కేయ్ 55 బంతుల్లో 43 పరుగులు (3 సిక్సర్‌లతో సహా) చేసి జట్టును విజయానికి చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, న్యూ నార్ఫోక్ వైస్-కెప్టెన్ హ్యారీ బూత్ బౌలింగ్ సమయంలో మన్కడింగ్‌తో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జెరోడ్ కేయ్‌ను రనౌట్ చేశాడు. ఆ తర్వాత ఎంపైర్‌కు అప్పీల్ చేశాడు.
ఆ తర్వాత ఇద్దరు ఆన్-ఫీల్డ్ అంపైర్ల మధ్య కొద్దిసేపు చర్చ జరిగింది. జెరోడ్ కేయ్‌కు ఔట్‌గా ప్రకటించారు. జెరోడ్ కేయ్ ఔట్ కావడంతో కోపంతో రగిలిపోయాడు. జెరోడ్ కేయ్ తన బ్యాట్, హెల్మెట్‌ను గ్రౌండ్ నుంచి బౌండరీ లైన్ వైపు గట్టిగా విసిరి కొట్టాడు. ఆ తర్వాత, వెనక్కి తిరిగి, అరవడం ప్రారంభించారు. ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు. అసభ్యకరంగా వేలు చూపిస్తూ.. తన రెండు గ్లౌజులను తీసి కాలితో తన్నుతూ పెవిలియన్ చేరాడు.
వైరల్ వీడియో..
A Tasmanian cricketer was NOT happy after getting out via a Mankad and launched his bat, helmet and gloves into the air! ?? pic.twitter.com/y64z4kwpE3
— Fox Cricket (@FoxCricket) March 28, 2023
కాగా, జెరోడ్ కేయ్ సహచరులు కొందరు నిరసనగా రంగంలోకి దిగారు. అనంతరం అంపైర్లు అతడిని మైదానం నుంచి బయటకు పంపారు. జెరోడ్ కేయ్ వీడియో ట్విటర్‌లో వైరల్‌గా మారింది.
ఇలా ఔట్ అయిన తర్వాత జెరోడ్ కేయ్ తిరిగి పెవిలియన్ చేరడంతో క్లేర్‌మాంట్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. క్లేర్‌మాంట్‌పై న్యూ నార్ఫోక్ విజయం సాధించింది. న్యూ నార్ఫోక్ విజయంలో హ్యారీ బూత్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించాడు. హ్యారీ బూత్ 84 బంతుల్లో 63 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..