IPL 2023: ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. తొలి మ్యాచ్‌లకు దూరమైన కీలక ఆటగాళ్లు.. లిస్టులో 8 మంది..
ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుండగా, ఈ లీగ్‌లోని 6 జట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే వారి ఆటగాళ్లలో కొందరు మొదటి మ్యాచ్ ఆడడంలేదు. మొత్తం 8 మంది ఆటగాళ్లు తొలి మ్యాచ్‌కు దూరమయ్యారు.
ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుండగా, ఈ లీగ్‌లోని 6 జట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే కొందరు ఆటగాళ్లు మొదటి మ్యాచ్ ఆడడంలేదు. మొత్తం 8 మంది ఆటగాళ్లు తొలి మ్యాచ్‌కు దూరమయ్యారు. దీంతో ఫ్రాంచైజీలకు తొలి మ్యాచ్ చాలా క్లిష్టంగా మరింది.
తొలి మ్యాచ్ ఆడడని ప్లేయర్లు వీరే..
డేవిడ్ మిల్లర్- గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఈ ఆటగాడు తన తొలి మ్యాచ్ ఆడలేడు. ఐపీఎల్‌లో గుజరాత్ జట్టు చెన్నైతో తొలి మ్యాచ్ ఆడనుండగా, ఈ మ్యాచ్‌లో మిల్లర్ అందుబాటులో ఉండడం లేదు. గత సీజన్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలపడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు.
క్వింటన్ డికాక్ – ఈ జాబితాలో రెండవ పెద్ద పేరు క్వింటన్ డికాక్‌దే. అతను లక్నో సూపర్ జెయింట్స్ కీలక ఆటగాడు. వికెట్ కీపింగ్‌తో పాటు, డికాక్ ఓపెనింగ్ కూడా చేస్తాడు. అతను మొదటి మ్యాచ్‌లో ఆడకపోవడంతో, లక్నో జట్టు ఇప్పుడు కైల్ మేయర్స్‌తో ఓపెనింగ్ చేయనున్నాడని తెలుస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అతిపెద్ద ఓటమి..
దక్షిణాఫ్రికాలో జరిగిన వన్డే సిరీస్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా నష్టపోయింది. సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ మొదటి మ్యాచ్ ఆడలేడు. మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ సభ్యులు. వారు నెదర్లాండ్స్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడనున్నారు.
ఢిల్లీ, పంజాబ్, చెన్నైలకు కూడా షాక్..
ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన ఎన్రిక్ నోర్కియా, పంజాబ్ కింగ్స్‌కు చెందిన కగిసో రబడ, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన సిసంద మగల కూడా మొదటి మ్యాచ్ ఆడలేరు. ఈ ఆటగాళ్ల గైర్హాజరీతో జట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..