5

KKR Captain: నెట్స్‌లో ప్రతిరోజూ 100 సిక్స్‌లు.. కట్‌చేస్తే.. కోల్‌కతా కొత్త సారథిగా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?

Kolkata Knight Riders Captain Nitish Rana: ఐపీఎల్-2023కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయ్యర్ ఈ సీజన్‌లో ఆడలేడని స్పష్టమైంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరంటూ..

KKR Captain: నెట్స్‌లో ప్రతిరోజూ 100 సిక్స్‌లు.. కట్‌చేస్తే.. కోల్‌కతా కొత్త సారథిగా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
Kkr Ipl 2023
Follow us

|

Updated on: Mar 27, 2023 | 6:21 PM

ఐపీఎల్-2023కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అయ్యర్ ఈ సీజన్‌లో ఆడలేడని స్పష్టమైంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కేకేఆర్ కొత్త కెప్టెన్ ఎవరంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలకు ఫ్రాంచైజీ నేడు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ సీజన్‌లో నితీష్ రానా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని.. రానా చాలా కాలంగా జట్టుతో ఉన్నాడని, ఇప్పుడు అతను కెప్టెన్‌గా కనిపిస్తాడని కోల్‌కతా ప్రకటించింది.

నితీష్ 2018 నుంచి ఐపీఎల్‌లో కేకేఆర్ తరపున ఆడుతున్నాడు. అంతకుముందు అతను ముంబై ఇండియన్స్‌ తరపున ఆడేవాడు. 2016లో ముంబైతో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. 2017లో కూడా ముంబై తరపున ఆడి కోల్‌కతాకు వచ్చాడు. రానా కోచ్ సంజయ్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో అతను నెట్స్‌లో రోజూ 100 సిక్సర్లు కొట్టేవాడని పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

అయ్యర్ గైర్హాజరీతో రాణాకు ఛాన్స్..

అయ్యర్ ఎన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడో లేదా అతను మొత్తం సీజన్‌లో ఆడలేడా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయ్యర్ గైర్హాజరీలో రాణా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని కోల్‌కతా తన ప్రకటనలో పేర్కొంది. ఒక దశలో అయ్యర్ ఐపీఎల్‌లో పునరాగమనం చేస్తాడని ఫ్రాంచైజీ ఆశలు పెట్టుకుంది. రాణాకు తన సొంత రాష్ట్రమైన ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఉందని, ఈ దృష్ట్యా అతన్ని కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు కోల్‌కతా తెలిపింది. రాణాకు కోచ్ చంద్రకాంత్ పండిట్, సహాయక సిబ్బంది మద్దతు ఉంది. 2014 నుంచి కోల్‌కతా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అలాగే ఫైనల్స్‌కు కూడా చేరలేదు. రానా సారథ్యంలో జట్టు విజయం సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది.

ఐపీఎల్ కెరీర్..

రానా 2016 నుంచి నిరంతరం ఐపీఎల్‌ ఆడుతున్నారు. అతను ఇప్పటివరకు 91 IPL మ్యాచ్‌లు ఆడాడు. 28.32 సగటు, 134.22 స్ట్రైక్ రేట్‌తో 2181 పరుగులు చేశాడు. ఈ సమయంలో, రానా బ్యాట్ నుంచి 15 అర్ధ సెంచరీలు వచ్చాయి. అతను తన బౌలింగ్‌తో జట్టుకు చాలాసార్లు ఉపయోగపడాడు. ఐపీఎల్‌లో మొత్తం ఏడు వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Bigg Boss 7 Telugu: భారీగా వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీలు.. లిస్టు ఇదే
Bigg Boss 7 Telugu: భారీగా వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీలు.. లిస్టు ఇదే
పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌కు అదిరిపోయే అతిథ్యం.. మెనూ ఏంటంటే..
పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌కు అదిరిపోయే అతిథ్యం.. మెనూ ఏంటంటే..
చంద్రముఖి 2 మూవీ రివ్యూ.. ప్లస్ అండ్ మైనస్‌లు ఇవీ..
చంద్రముఖి 2 మూవీ రివ్యూ.. ప్లస్ అండ్ మైనస్‌లు ఇవీ..
పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు
పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు
రాజకీయ పార్టీలను కలవరపెడుతున్న సింగరేణి ఎన్నికలు.. ఎందుకంటే ?
రాజకీయ పార్టీలను కలవరపెడుతున్న సింగరేణి ఎన్నికలు.. ఎందుకంటే ?
సొంతంగా కాస్మోటిక్స్ బ్రాండ్ లాంచ్ చేసిన నయన్..
సొంతంగా కాస్మోటిక్స్ బ్రాండ్ లాంచ్ చేసిన నయన్..
మైనర్లకు ఇచ్చిన గిఫ్ట్‌పై టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
మైనర్లకు ఇచ్చిన గిఫ్ట్‌పై టాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
అమెరికాలో విద్యార్థులకు లెక్కలు రాక తంటాలు.. నిపుణుల హెచ్చరిక
అమెరికాలో విద్యార్థులకు లెక్కలు రాక తంటాలు.. నిపుణుల హెచ్చరిక
ఎల్‌జీ నుంచి అదిరే ల్యాప్‌టాప్‌ లాంచ్‌.. షాకింగ్ ఫీచర్లు
ఎల్‌జీ నుంచి అదిరే ల్యాప్‌టాప్‌ లాంచ్‌.. షాకింగ్ ఫీచర్లు
కరీజ్మా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎక్స్‌ఎంఆర్‌ 210పై సూపర్ ఆఫర్
కరీజ్మా లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఎక్స్‌ఎంఆర్‌ 210పై సూపర్ ఆఫర్