కాకా.. నీ బౌలింగ్ కేక.. బ్యాటర్లకు అందని ద్రాక్షలా మారిన బౌండరీలు.. స్పెషల్ సెంచరీతో స్టార్ బౌలర్ ప్రపంచ రికార్డ్..
T20 Records: టీ20 క్రికెట్‌ను బ్యాట్స్‌మెన్ గేమ్‌గా పరిగణిస్తుంటాం. ఈ ఫార్మాట్‌లో బౌలర్లను బలిపశువులుగా మారుతుంటారు. సిక్సర్లు, ఫోర్ల వర్షంతో బౌలర్లను చితక్కొడుతుంటారు. అయితే ఈ టీ20 ఫార్మాట్‌లో ఒక బౌలర్ మాత్రం.. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
టీ20 క్రికెట్‌ను బ్యాట్స్‌మెన్ గేమ్‌గా పరిగణిస్తుంటాం. ఈ ఫార్మాట్‌లో బౌలర్లను బలిపశువులుగా మారుతుంటారు. సిక్సర్లు, ఫోర్ల వర్షంతో బౌలర్లను చితక్కొడుతుంటారు. అయితే ఈ టీ20 ఫార్మాట్‌లో ఒక బౌలర్ మాత్రం.. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆయన బౌలింగ్‌లో ఆడడం బ్యాటర్లకు అంత సులభం కాదనడంలో ఎలాంటి సందేహ లేదు. ఆయన ఎవరో కాదు.. ఆప్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్. అతని పేరుతో టీ20 క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ఇది ఊహించడం కూడా కష్టం. బహుశా ఈ కారణంగానే బౌలర్‌ను మనిషులతో కాదు.. గ్రహాంతరవాసులతో పోలుస్తున్నారు.
టీ20 ఇంటర్నేషనల్‌లో రషీద్ ఖాన్ ఓ సెంచరీతో అద్బుత రికార్డ్ నెలకొల్పాడు. దాని గురించి మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. టీ20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ 106 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ తరచుగా బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో 106 బంతుల్లో ఒక్క ఫోర్ లేదా సిక్స్ కొట్టకపోవడం నిజంగా పెద్ద విషయమే. రషీద్ ఖాన్ ఈ ‘సెంచరీ’ బాల్స్ చాలా మంది బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించింది.
రషీద్ ఖాన్ స్పెషల్ సెంచరీ..
యూఏఈతో జరిగిన తొలి టీ20తో రషీద్ ఖాన్ ఈ రికార్డును నెలకొల్పాడు. యూఏఈతో జరిగిన తొలి టీ20లో రెండు బంతుల్లో ఎలాంటి బౌండరీ ఇవ్వలేదు. ఆ తర్వాత, రెండవ, మూడవ టీ20లో UAEపై మొత్తం 24 బంతుల్లో ఎటువంటి బౌండరీని కొట్టనివ్వలేదు. షార్జాలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో రషీద్ ఖాన్ 24 బంతుల్లో ఎలాంటి బౌండరీ ఇవ్వలేదు. ఆ తర్వాత మూడో టీ20లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి 8 బంతుల్లో రషీద్ ఖాన్ ఎలాంటి బౌండరీ ఇవ్వలేదు. ఈ విధంగా రషీద్ ఖాన్ 106 బంతుల్లో ఫోర్ లేదా సిక్స్ బాదలేదు.
Rashid nicely operating his googlies ☝️?#AfghanAtalan | #AFGvPAK | #LobaBaRangRawri pic.twitter.com/ZHgf5DpnCV
— Afghanistan Cricket Board (@ACBofficials) March 27, 2023
బ్యాట్స్‌మెన్‌కు ఓ పజిల్‌లా మారిన రషీద్ ఖాన్..
టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌కు రషీద్ ఖాన్ ఒక పజిల్‌లా మారాడు. ఈ ఆటగాడు 80 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 129 వికెట్లు తీసుకున్నాడు. అతని ఎకానమీ రేటు కేవలం 6.18గా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ ఐపీఎల్‌లో కూడా రషీద్ ఖాన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ఆటగాడు ఐపిఎల్‌లో 92 మ్యాచ్‌లలో 112 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో కూడా అతని ఎకానమీ రేటు ఓవర్‌కు 6.38 పరుగులుగా నిలిచింది. టీ20 ఫార్మాట్‌లో రషీద్ ఖాన్ అత్యుత్తమ బౌలర్ అని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..