AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: 47 బంతుల్లో సెంచరీ నుంచి అత్యధిక పరుగుల వరకు.. కింగ్ కోహ్లీ రికార్డులు చూస్తే.. ప్రత్యర్థులకు వణుకే..

Virat Kohli: ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. మరోసారి ఈ టోర్నమెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడు విరాట్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్‌సీబీ తరపున ఎన్నో రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు.

IPL 2023: 47 బంతుల్లో సెంచరీ నుంచి అత్యధిక పరుగుల వరకు.. కింగ్ కోహ్లీ రికార్డులు చూస్తే.. ప్రత్యర్థులకు వణుకే..
ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ లిస్టులో కింగ్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 215 ఇన్నింగ్స్ ఆడిన విరాట్.. మొత్తంగా 6,624 పరుగులు రాబట్టాడు. విశేషమేమిటంటే.. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్‌‌లో ఆడిన ప్రతి మ్యాచ్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడాడు.
Follow us
Venkata Chari

|

Updated on: Mar 28, 2023 | 2:33 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కాకుండా మరో మ్యాచ్‌ను కోట్లాది మంది అభిమానులు వీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడాల్సిన ఆర్‌సీబీపై ఇది చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్.

లక్షలాది మంది అభిమానులు దృష్టి విరాట్ కోహ్లిపైనే. విరాట్ కోహ్లీ తన గణాంకాలతో ఈ స్థానాన్ని సాధించాడు. దీంతో మ్యాచ్‌లో కోహ్లీ ఉంటే.. ఫ్యాన్స్ పండుగ చేసుకునేందుకు స్టేడియాలకు వస్తుంటారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌లో అతని రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. 2016లో పంజాబ్ కింగ్స్‌పై విరాట్ కోహ్లీ 47 బంతుల్లో సెంచరీ చేశాడు. అదే సీజన్‌లో 53, 56 బంతుల్లో సెంచరీ కూడా చేశాడు.
  2. కెప్టెన్‌గా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా విరాట్ కోహ్లి 4881 పరుగులు చేయగా, ధోనీ 4556 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఒక సీజన్‌లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం కూడా విరాట్ కోహ్లి సాధించాడు. 2016లో డివిలియర్స్‌తో కలిసి విరాట్ 939 పరుగులు జోడించాడు.
  5. ఒక సీజన్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారతీయుడు విరాట్ కోహ్లీ. 2016లో విరాట్ కోహ్లీ 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. క్రిస్ గేల్ ఒక సీజన్‌లో గరిష్టంగా 6 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 2011లో ఈ ఘనత సాధించాడు.
  6. ఏదైనా రెండు బ్యాటింగ్ స్థానాల్లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఓపెనింగ్, నంబర్ 3 స్థానాల్లో ఈ ఘనత సాధించాడు.
  7. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి 3554 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇది మాత్రమే కాదు, అతను ఛేజింగ్‌లో కూడా అత్యధికంగా 3070 పరుగులు చేశాడు.
  8. ఐపీఎల్‌లో అత్యధిక ఇన్నింగ్స్‌లు 30 పరుగులకు పైగా ఆడిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అతను 96 సార్లు ఈ ఘనత సాధించాడు. ఈ సీజన్‌లో కోహ్లీ 100కు చేరుకోగలడు.
  9. ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. 2016లో 16 మ్యాచ్‌ల్లో 973 పరుగులు చేశాడు. ఇందులో అతని బ్యాట్‌లో 4 సెంచరీలు వచ్చాయి.
  10. ఐపీఎల్‌లో అత్యధికంగా 5 సెంచరీలు చేసిన భారత ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్‌లో మరో సెంచరీ సాధిస్తే క్రిస్ గేల్‌తో సమానం అవుతాడు. రెండు సెంచరీలు పడితే మరో రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు.
  11. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అతని బ్యాట్‌ నుంచి 6411 పరుగులు వచ్చాయి. ఈ సీజన్ అద్భుతంగా ఉంటే 7 వేలకు చేరే ఛాన్స్ ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..