తుమ్మి మొక్క ఉపయోగాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు.. ఈ చిన్ని ఆకు సర్వరోగ నివారణి ..!

వినాయక చవితి పండగ నాడు ప్రతి ఇంట్లో తప్పక తుమ్మి కూరను వండుతారు. అలాంటి తుమ్మి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తుమ్మి చెట్టును ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి..?

తుమ్మి మొక్క ఉపయోగాలు తెలిస్తే నోరెళ్ల బెడతారు..  ఈ చిన్ని ఆకు సర్వరోగ నివారణి ..!
Thummi Chettu
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 27, 2023 | 8:56 PM

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా మొక్కలు వివిధ రోగాలకు దివ్యౌషధాలుగా పనిచేస్తాయి. కానీ, వాటిని ఎలా ఉప‌యోగించాలో తెలియ‌క మ‌నం చాలా న‌ష్ట‌పోతున్నాం. ఔష‌ధాలుగా మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల‌లో తుమ్మి మొక్క కూడా ఒక‌టి. వినాయక చవితి నాడు ప్రతి ఇంట్లో తప్పక తుమ్మి కూరను వండుతారు. అలాంటి తుమ్మి మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల రోగాల‌ను న‌యం చేయ‌డంలో ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తుమ్మి చెట్టును ఉప‌యోగించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి..? ఏఏ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. వ్యాధుల‌ను న‌యం చేయ‌డానికి దీనిని ఏ విధంగా ఉప‌యోగించాలి.. ఇక్కడ తెలుసుకుందాం.

తుమ్మి మొక్క ఆకుల‌ను కూర‌గా చేసుకుని తిన‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ మొక్క ఆకుల‌తో చేసిన కూర‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతంది. శ‌రీరం నుండి వ్య‌ర్థాలు తొలగిస్తుంది. . ప‌క్ష‌వాతానికి గురైన వాళ్ల‌కు ఈ మొక్క ఆకులతో చేసిన కూర‌ను పెట్ట‌డం వ‌ల్ల ప‌క్ష‌వాతం నుండి త్వ‌ర‌గా కోలుకుంటారు.

తేలు, పాము విషాన్ని హ‌రించ‌డంలోనూ ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తుమ్మి మొక్క ఆకులను మెత్త‌గా దంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని తేలు లేదా పాము కుట్టిన చోట వేయాలి. తేలు లేదా పాము కుట్టిన వ్య‌క్తి కూడా ఈ ర‌సాన్ని 2 టీ స్పూన్స్ చొప్పున తాగించాలి. అలాగే దంచిన ఆకుల‌ను తేలు లేదా పాము కుట్టిన చోట ఉంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల తేలు కాటు, పాము కాటు ప్రాణాంత‌కంగా మార‌కుండా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

శ‌రీరంలో నొప్పులు, వాపులు ఉన్న చోట ఈ మొక్క ఆకుల ర‌సాన్ని లేదా ఆకుల‌ను దంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య‌ల‌ నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ మొక్క ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని నోట్లో కొద్ది సేపు ఉంచుకుని పుక్కిలించి ఉమ్మ‌డం వ‌ల్ల నోటిపూత త‌గ్గుతుంది.

ఆకుల ర‌సాన్ని రెండు పూట‌లా 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండ‌డం వ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది. గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలోనూ తుమ్మి మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని చ‌ర్మంపై లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి.

తాజా తుమ్మి ఆకుల ర‌సాన్ని రెండు చుక్క‌ల మోతాదులో ముక్కు రంధ్రాల‌లో వేసుకోవ‌డం వ‌ల్ల సైనుసైటిస్ త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల ర‌సాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తాగుతుండ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, ఆయాసం వంటి సమ‌స్య‌లు త‌గ్గుతాయి.

ఆకుల ర‌సాన్ని రెండు పూట‌లా 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండ‌డం వ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది. గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలోనూ తుమ్మి మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని చ‌ర్మంపై లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి.

నెల‌స‌రి స‌మ‌యంలో అధిక ర‌క్తస్రావంతో బాధ‌ప‌డే స్త్రీలు తుమ్మి ఆకుల‌ను తీసుకుని పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ కు నిమ్మ‌ర‌సాన్ని, నువ్వుల నూనెను క‌లిపి ప‌ర‌గ‌డుపున తింటూ ఉండ‌డం వ‌ల్ల అధిక ర‌క్తస్రావం తగ్గిపోతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..

నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
మెల్‌బోర్న్‌‌లో విరాట్‌ కోహ్లి సెంచరీ పక్కా.. ఇదిగో గణాంకాలు
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
బరాక్ ఒబామాకు నచ్చిన భారతీయ సినిమా ఇదే..
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
నేడు ప్రపంచ తొలి ధ్యాన దినోత్సవం.. ధ్యానంతో కలిగే ప్రయోజనాలేంటి?
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
ఆస్తి కోసం దాడి చేసి తల్లినే హతమార్చాడు..
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి
మైక్రో ఫైనాన్స్ వలలో ఇరుక్కున్నారేమో చూసుకోండి