AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. పాఠశాల తనిఖీల్లో దొరికన బీరుబాటిళ్లు, కండోమ్స్‌..! స్కూల్‌కి సీల్..!!

కమీషన్ బృందం స్కూల్లోని ఒక గదిలో పరుపులు, మద్యం, కండోమ్‌లతో పాటు గుడ్డు ట్రేలు, గ్యాస్ సిలిండర్లను సీజ్‌ చేశారు. గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లతో సహా ఇతర అభ్యంతరకరమైన వస్తువులను కూడా గుర్తించారు.  పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని SCPCR తనిఖీ బృందం సభ్యురాలు నివేదా శర్మ డిమాండ్‌ చేశారు.

షాకింగ్.. పాఠశాల తనిఖీల్లో దొరికన బీరుబాటిళ్లు, కండోమ్స్‌..! స్కూల్‌కి సీల్..!!
Liquor And Condoms
Jyothi Gadda
|

Updated on: Mar 27, 2023 | 7:36 PM

Share

చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలో భయంకర దృశ్యాలు దర్శనమిచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపల్ గదిలో మద్యం, కండోమ్‌లతో సహా అభ్యంతరకరమైన పదార్థాలను గుర్తించారు అధికారులు. దాంతో వెంటనే ఆ స్కూల్‌కి సీల్‌ వేశారు అధికారులు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు నివేదిత శర్మ , జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ఏకే పాఠక్‌తో కలిసి సాధారణ తనిఖీ కోసం జాతీయ రహదారిపై ఉన్న పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే పాఠశాల ప్రిన్సిపాల్ గదిలో అభ్యంతరకరమైన పదార్థాలు కనిపించాయి. .

కమీషన్ బృందం స్కూల్లోని ఒక గదిలో పరుపులు, మద్యం, కండోమ్‌లతో పాటు గుడ్డు ట్రేలు, గ్యాస్ సిలిండర్లను సీజ్‌ చేశారు. గ్యాస్ సిలిండర్లు, మద్యం బాటిళ్లతో సహా ఇతర అభ్యంతరకరమైన వస్తువులను కూడా గుర్తించారు.  పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని SCPCR తనిఖీ బృందం సభ్యురాలు నివేదా శర్మ డిమాండ్‌ చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

సాధారణ తనిఖీల్లో భాగంగానే ఇక్కడకు వచ్చామని చెప్పారు. స్కూల్లో తనిఖీ చేస్తుండగా,  ఒక గదిలో మద్యం సీసాలు, కండోమ్‌లు కనిపించాయి. ఇది పూర్తిగా విలాసవంతమైన నివాస సెటప్‌గా కనిపించదని చెప్పారు. పైగా ఆ గదిలో 15 పడకలు ఉన్నాయని, సీసీ కెమెరా కూడా లేదని ఆమె తెలిపారు. భవనంలోని ఇతర ప్రదేశాలలో CCTV కెమెరాలను అమర్చినప్పుడు, ఆ ప్రత్యేక విభాగాన్ని ఎందుకు వదిలివేశారు అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రిన్సిపాల్ తాను అక్కడ ఉండట్లేదని చెబితే, మరీ ఇక్కడ ఎవరు ఉంటున్నారు ..? అక్కడ 15 పడకలు ఎందుకు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆ గదికి బాలికల తరగతి గదులతో నేరుగా ప్రవేశం ఎందుకు ఉంది అని నివేద శర్మ నిలదీశారు. పాఠశాల ఆవరణలోకి మద్యాన్ని అస్సలు అనుమతించబోమని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆమె హెచ్చరించారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ విషయంపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..