AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓల్డ్‌ మ్యాన్‌ బైక్‌ స్టంట్‌ సూపరో సూపర్.. వీడియో చూస్తే విజిల్‌ వేయాల్సిందే..

వారం రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు భారీ స్థాయిలో లైక్స్ వచ్చాయి. దీనికి ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. బైక్ పై తాత చేసిన విన్యాసాలు చూసి వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ముసలోడే గానీ, తాత సూపరో సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

Viral Video: ఓల్డ్‌ మ్యాన్‌ బైక్‌ స్టంట్‌ సూపరో సూపర్.. వీడియో చూస్తే విజిల్‌ వేయాల్సిందే..
Old Man Dangerous Bike Stun
Jyothi Gadda
|

Updated on: Mar 27, 2023 | 5:22 PM

Share

అబ్బాయిలు బైక్‌ల నడుమ బంధం విడదీయరానిదని చెప్పాలి. ఎందుకంటే, అబ్బాయిల చేతిలో బైక్ ఉందంటే చాలు.. గాల్లో ఎగురుతున్నట్టే..! బైక్‌పై చక్కర్లు కొట్టడం అంటే..వారి థ్రిల్లింగ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. మాంచి బైక్‌ చేతిలో ఉందంటే.. ఇక వారిని ఆపడం చాలా కష్టం. సోషల్ మీడియాలో కొందరు పోకిరీలు, యువకులు చేసే బైక్ స్టంట్ వీడియోలు అనేకం వైరల్‌గా మారుతుంటాయి. అయితే, అలాంటి అబ్బాయిలు సైతం ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టుకునేలా ఓ తాత బైక్ స్టంట్ చేశాడు. అబ్బాయిలు కూడా ఔరా అనుకునేలా బైక్‌తో విన్యాసాలు చేశాడు తాతయ్య. ఈ తాత రన్నింగ్ బైక్ పై డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఒక వృద్ధుడు బైక్‌తో రోడ్డుపై విన్యాసాలు చేస్తున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. బైక్‌పై వెళ్తున్న తాత.. మొదట తన బైక్ హ్యాండిల్‌ని వదిలేశాడు. ఆపై బైక్‌పై డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. బైక్‌పై రెండు చేతులు వదిలేసి నిలబడుతూ, కూర్చుంటూ నానా హంగామా చేస్తున్నాడు. వెనక్కి వాలిపోతూ గాల్లో చేతులను ఆడిస్తున్నాడు. చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ బైక్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ నడిపిస్తున్నాడు. ఏ మాత్రం కూడా భయం, బెరుకు, తడబాటు లేకుండా అబ్బాయిలు కూడా చేయని విన్యాసాలు తాతయ్య చేశాడు.

ఇవి కూడా చదవండి

తాతయ్య బైక్‌పై విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ajit_navghane_official_07 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేయగా,. ఈ వీడియోకు టన్నుల కొద్దీ లైక్‌లు, కామెంట్‌లు వస్తున్నాయి. వారం రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకు భారీ స్థాయిలో లైక్స్ వచ్చాయి. దీనికి ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. బైక్ పై తాత చేసిన విన్యాసాలు చూసి వీడియో చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ముసలోడే గానీ, తాత సూపరో సూపర్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..