Watch: ఆస్పత్రిలో ఇంత దారుణమా..? నడవలేని వృద్ధుడిని బెడ్‌షీట్‌తో ఈడ్చుకెళ్లిన కోడలు..
రోగిని దుప్పట్లో కూర్చుబెట్టుకుని ఆస్పత్రిలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. కొందరు ఆమె చేస్తున్న పనిని ఫోటోలు వీడియోలు కూడా తీశారు. అవే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అనారోగ్యంతో ఉన్న రోగిని ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లిన మహిళ ఆ రోగిని దుప్పట్లో కూర్చుబెట్టుకుని ఆస్పత్రిలో ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. కొందరు ఆమె చేస్తున్న పనిని ఫోటోలు వీడియోలు కూడా తీశారు. అవే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. స్ట్రెచర్ లేకుండా షీట్‌పై వృద్ధుడిని ఈడ్చుకెళ్తున్న మహిళ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్ శివారు ప్రాంతానికి చెందిన విపిన్ ఓజా అనే వృద్ధుడు సైకిల్‌పై వెళ్తుండగా కిందపడిపోయాడు. దాంతో అతడి కుడికాలు విరిగిపోయింది. కాలునొప్పితో అవస్థ పడుతున్న వృద్ధుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది అతడి కోడలు. అయితే, నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడిని తరలించేందుకు ఆస్పత్రిలో స్ట్రెచర్ కనిపించకపోవడంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. దిక్కుతోచని స్థితిలో ఒక బెడ్‌షీట్‌పై వృద్ధుడిని కూర్చోబెట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
मध्यप्रदेश की शर्मसार करती तस्वीर, — स्ट्रेचर के अभाव में एक बहू अपने ससुर को ज़मीन पर घसीटकर ले जाती हुई;
शिवराज जी, प्रदेश आपके कुकर्मों से शर्मिंदा है। pic.twitter.com/MdaLj9HmOQ
— MP Congress (@INCMP) March 27, 2023
గ్వాలియర్ మండలంలో 397 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రి దుస్థితిని వివరిస్తూ.. మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ శ్రీ శివరాజ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దృశ్యం మధ్యప్రదేశ్ పరిపాలన తీరుకు నిదర్శనమంటూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ..