Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో క్రమం తప్పకుండా తాగాల్సిన ఫ్రూట్‌ జ్యూస్‌.. పండులాగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..

ఎందుకంటే ఈ ఫ్రూట్ జ్యూస్ మీ బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, ఇంకా సరైన వ్యాయామం అతి ముఖ్యమైనవిగా చెబుతారు ఆరోగ్య నిపుణులు.

వేసవిలో క్రమం తప్పకుండా తాగాల్సిన ఫ్రూట్‌ జ్యూస్‌.. పండులాగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..
Fruit Juice In Summers
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 27, 2023 | 6:00 PM

వేసవికాలం వచ్చేసింది. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం, ఉక్కపోత, డీహైడ్రేషన్‌ కారణంగా ప్రజలు ఎక్కువగా శీతలపానీయాలను ఆశ్రయిస్తుంటారు. కొబ్బరి బోండాలు, చెరుకు రసం, నిమ్మకాయ నీళ్లు,ఫ్రూట్‌ జ్యూస్‌లు కూడా ఎక్కువగా తాగుతుంటారు. అయితే, ఈ వేసవిలో అన్ని రకాలైన పండ్లతో పాటుగా దానిమ్మ పండు కూడా పోషకమైనది. రుచికరమైనది, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే గొప్ప ఫ్రూట్‌ దానిమ్మ. వేసవిలో దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు నయమవుతాయి. వేగంగా బరువు తగ్గాలనుకునే వారికి దానిమ్మ రసం ఉపయోగపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దానిమ్మ రసం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండడమే ఇందుకు కారణం.

దానిమ్మ రసంలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. ఇది తాగిన తర్వాత, మీకు త్వరగా ఆకలి వేయదు. అంటే మీరు అనారోగ్యకరమైన చిరుతిళ్లకు దూరంగా ఉంటారు. దానిమ్మ రసంలో చక్కెర, విటమిన్లు చాలా ఉన్నాయి. రసంలోని చక్కెర విటమిన్లు మరియు ఖనిజాలతో పాటు సులభంగా జీర్ణమవుతుంది. ఈ రసం మీకు శక్తిని ఇస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. దానిమ్మ రసం తాగిన తర్వాత, మీ నోటికి అనవసరంగా ఏదైనా తినే అలవాటు తగ్గిపోతుంది. అందుకే దానిమ్మ రసం బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

దానిమ్మ రసం ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. అదనంగా, అవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే దానిమ్మ రసం తీసుకోవడం ప్రారంభించండి. ఎందుకంటే ఇది మీ బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం వ్యాయామం అతి ముఖ్యమైనవిగా చెబుతారు ఆరోగ్య నిపుణులు.

తాజా దానిమ్మ రసంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది. ఈ రసం మీ పేగులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం..