Vehicle Parking Rules: వాహనదారులకు అలర్ట్..! ఈ రూల్స్ పాటిస్తే.. రూ. 500 బహుమతి..!
వాహనం ఫొటో పంపితే 500 రూపాయల బహుమతి ఇస్తామని కేంద్ర మంత్రి ఓ కార్యక్రమంలో ప్రకటించారు. కేంద్ర మంత్రి ఈ ప్రకటన విని కారు, బైక్, ఇతర వాహన చోదకులతోపాటు సామాన్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ నిబంధన విని డ్రైవర్లు ఆశ్చర్యపోతున్నారని నితిన్ గడ్కరీ అన్నారు.
వాహనాల పార్కింగ్‌కు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్యమైన ప్రకటన చేశారు. రోడ్లపై తప్పుగా పార్కింగ్ చేసిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.. అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసే వాహనాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడేందుకు గడ్కరీ కొత్త ప్రకటన చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి మాటలు విని అందరూ అవాక్కయ్యారు . రోడ్డుపై తప్పుగా పార్క్ చేసిన వాహనం ఫొటో పంపితే 500 రూపాయల బహుమతి ఇస్తామని కేంద్ర మంత్రి ఓ కార్యక్రమంలో ప్రకటించారు. కేంద్ర మంత్రి ఈ ప్రకటన విని కారు, బైక్, ఇతర వాహన చోదకులతోపాటు సామాన్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. త్వరలోనే ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.
ఈ నిబంధన విని డ్రైవర్లు ఆశ్చర్యపోతున్నారని నితిన్ గడ్కరీ అన్నారు. అయితే ఇది అమలులోకి వచ్చిన తర్వాత నగరాల్లో ట్రాఫిక్ జామ్‌ల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు.. వాహనాన్ని తప్పుగా పార్క్ చేస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. అలాంటి వాహనాల ఫోటో పంపినందుకు 500 రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు.
తప్పుడు పార్కింగ్‌ను అరికట్టడమే ఈ చట్టం తీసుకురావడం ఉద్దేశమని గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. పార్కింగ్‌కు సంబంధించి కొత్త చట్టం తీసుకురాబోతున్నామని, దీని ప్రకారం రోడ్డు పక్కన వాహనాలను పార్క్ చేసే వారికి రూ.1000 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా, తప్పుగా పార్క్ చేసిన వాహనం ఫోటో తీసిన పంపిన వ్యక్తికి రూ.500 రివార్డు ఇవ్వబడుతుందని ఆయన చెప్పారు.