AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యకు గర్భస్రావం కాకుండా ఉండేందుకు ఏడేళ్ల బాలికను బలి ఇచ్చిన దుర్మార్గుడు

Human sacrifice in Kolkata: సమాజం ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధితో పరుగులు పెడుతుంటే.. మరో వైపు మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి.

భార్యకు గర్భస్రావం కాకుండా ఉండేందుకు ఏడేళ్ల బాలికను బలి ఇచ్చిన దుర్మార్గుడు
Black Magic
Balaraju Goud
|

Updated on: Mar 28, 2023 | 3:47 PM

Share

సమాజం ఓ వైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధితో పరుగులు పెడుతుంటే.. మరో వైపు మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. తాజాగా కోల్‌కతాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఏడేళ్ల మైనర్ బాలికను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. భార్యకు మరోసారి గర్భస్రావం కాకుండా ఉండేందుకు మంత్రగాడి సలహాతో పొరిగింటిలో ఉన్న బాలికను నరబలి ఇచ్చాడు. గర్భవతి అయిన తన భార్య ఆరోగ్యవంతమైన బిడ్డను ప్రసవించేందుకు ఒక బిడ్డను బలి ఇచ్చాడని పోలీసులు తెలిపారు.

అంతకుముందు రోజు బాలికను కిడ్నాప్ చేసిన హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. అదే భవనం నుండి మైనర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి లైంగిక వేధింపులకు గురైందా లేదా అన్నది నిర్ధారించేందుకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.

బీహార్‌కు చెందిన అలోక్ కుమార్ భార్యకు మూడుసార్లు గర్భస్రావమైంది. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. . తన భార్యకు మూడుసార్లు గర్భస్రావాలు జరగడంతో ఆ వ్యక్తి డిప్రెషన్‌కు గురయ్యాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆమె మళ్లీ గర్భం దాల్చినప్పుడు, ఆ వ్యక్తి తాంత్రికుడి సహాయం తీసుకున్నాడు. ఒక చిన్నారిని నరబలి ఇస్తే ఆమె గర్భం నిలుస్తుందని ఆ మంత్రగాడు చెప్పాడు. దీంతో అలోక్‌ కుమార్‌, ఆదివారం సాయంత్రం పొరుగున ఉండే ఏడేళ్ల బాలికను కిడ్నాప్‌ చేశాడు. నరబలి పేరుతో దారుణంగా హత్య చేశాడు. అతని సూచనలను గుడ్డిగా అనుసరించాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అలోక్ కుమార్‌ను అరెస్ట్‌ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి.. 

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..