AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Trains: ఇకపై సికింద్రాబాద్ టూ బెంగళూరు విద్యుత్ రైళ్లే.! ఆ మార్గంలో జెట్ స్పీడ్‌తో రయ్.. రయ్..

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు వరకు విద్యుత్ రైళ్లు నడిచే అవకాశం ఉంది..

Electric Trains: ఇకపై సికింద్రాబాద్ టూ బెంగళూరు విద్యుత్ రైళ్లే.! ఆ మార్గంలో జెట్ స్పీడ్‌తో రయ్.. రయ్..
Kurnool To Gadwal
Ravi Kiran
|

Updated on: Mar 28, 2023 | 4:53 PM

Share

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై సికింద్రాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరు వరకు విద్యుత్ రైళ్లు నడిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న గద్వాల్ – కర్నూలు సిటీ మధ్య 54 రూట్ కిమీ మార్గం విద్యుదీకరణ పనులు పూర్తయి.. ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ నుంచి ధర్మవరం వరకు.. అలాగే నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం నుంచి బెంగళూరు వరకు అంతరాయం లేకుండా విద్యుత్ ట్రాక్షన్‌ ద్వారా రైళ్లను నడిపేందుకు వీలు కలిగింది.

గద్వాల్ – కర్నూలు సిటీ స్టేషన్ల మధ్య విద్యుదీకరణ, డోన్ – కర్నూలు సిటీ – మహబూబ్‌నగర్‌ విద్యుదీకరణ, సికింద్రాబాద్ – ముద్ఖేడ్ – మన్మాడ్ విద్యుదీకరణ పనులు గ్రాండ్ ప్రాజెక్ట్‌లో భాగంగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ను 2018-19 సంవత్సరంలో రూ. 916.07 కోట్ల సవరించిన అంచనా వ్యయంతో చేపట్టింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని డోన్ – గుత్తి – ధర్మవరం, నైరుతి రైల్వే పరిధిలోని ధర్మవరం – బెంగళూరు సిటీ విభాగాల మధ్య విద్యుదీకరణ కూడా పూర్తయింది. దీంతో, ప్యాసింజర్, సరకు రవాణా రైళ్లు రెండూ సికింద్రాబాద్ నుంచి ధర్మవరం.. ధర్మవరం నుంచి బెంగళూరు మీదుగా సజావుగా ప్రయాణించేందుకు వీలుంటుంది.

ఈ ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో రైళ్ల రాకపోకల నిర్వహణ వల్ల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. ఎలక్ట్రిక్ ట్రాక్షన్‌తో ఇంజిన్ మార్చడం లాంటివి ఇకపై ఉండదు కాబట్టి.. రైళ్లను మార్గం మధ్యలో నిలిపే సమయం తగ్గుతుంది, అలాగే రైళ్ల సగటు వేగం పెరుగుతుంది. విద్యుదీరణ వల్ల రైల్వేలకు ఇంధన ఖర్చులు కూడా పెద్ద ఎత్తున ఆదా అవుతాయి. కాగా, ‘విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయడంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన ఎలక్ట్రికల్ వింగ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. గద్వాల్-కర్నూలు మధ్య మార్గంలో విద్యుదీకరణ పూర్తవడంతో, సికింద్రాబాద్-బెంగళూరు మధ్య మొత్తం సెక్షన్‌లో ఎలక్ట్రిక్ రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌