Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retail Store: ఎంఆర్‪పీ అంటే ఏమిటి? దుకాణదారుడు దాని కన్నా ఎక్కువ ధరకు విక్రయాలు చేస్తే ఏం చేయాలి?

చాలా మంది దుకాణదారులు ఎంఆర్పీ ధరపై ఎక్కువకే విక్రయాలు చేసేస్తుంటారు. అయితే అది చట్ట రీత్యా నేరం. అలా ఎవరైన దుకాణదారులు చేస్తే వినియోగదారులుగా మనం ప్రశ్నించవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు. అవసరం అయితే కేసు కూడా వేయవచ్చు.

Retail Store: ఎంఆర్‪పీ అంటే ఏమిటి? దుకాణదారుడు దాని కన్నా ఎక్కువ ధరకు విక్రయాలు చేస్తే ఏం చేయాలి?
Retail Store
Follow us
Madhu

|

Updated on: Mar 29, 2023 | 1:00 PM

సాధారణంగా మన దేశంలో ఎక్కడ ఏ వస్తువునైనా ఎంఆర్‪పీ ధరకే కొనుగోలు చేస్తాం. షాపుల యజమానులు కూడా ఎంఆర్పీ కన్నా తక్కువగా విక్రయించాలి గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క రూపాయి కూడా ఎంఆర్‪పీ కన్నా ఎక్కువ విక్రయించడానికి లేదు. అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఎంఆర్పీపై అవగాహన ఉండదు. చాలా మంది దుకాణదారులు ఎంఆర్‪పీ ధరపై ఎక్కువకే విక్రయాలు చేసేస్తుంటారు. అయితే అది చట్ట రీత్యా నేరం. అలా ఎవరైన దుకాణదారులు చేస్తే వినియోగదారులుగా మనం ప్రశ్నించవచ్చు. లేదా కేసు వేయవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఎంఆర్‪పీ అంటే ఏమిటి? దానిని ఎలా ఫిక్స్ చేస్తారు? ఎంఆర్‪పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఎటువంటి చర్యలుంటాయి? ఎవరిమీదనైనా ఫిర్యాదుచేయాలంటే ఎలా చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంఆర్‪పీ అంటే..

మన దేశంలో ఎవరైనా దుకాణదారుడు గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‪పీ) కంటే ఎక్కువ వసూలు చేస్తే, అది చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. లీగల్ మెట్రాలజీ చట్టం 2009 ప్రకారం ఒక ఉత్పత్తిపై ముద్రించిన ఎంఆర్పీ అనేది వినియోగదారుడు దానిని కొనుగోలు చేయడానికి చెల్లించాల్సిన గరిష్ట ధర. దీనిలోనే అన్ని పన్నులు వచ్చేస్తాయి. ఉత్పత్తి ఖర్చు, రవాణా ఖర్చు, తయారీదారు లాభం, విక్రేత లాభం అన్ని కలుపుకొని ఎంఆర్‪పీని నిర్ణయిస్తారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేయకుండా ఉండేందుకు ఈ ఎంఆర్‪పీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని ప్రతి వస్తువు ప్యాక్ పైనా ముద్రిస్తారు. అతిక్రమించిన విక్రేతలపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.

ఎంఆర్‪పీ కన్నా ఎక్కువ వసూలు చేస్తే..

ఇవి కూడా చదవండి
  • దుకాణదారుడు ఎంఆర్‪పీ కంటే ఎక్కువ వసూలు చేస్తే, వినియోగదారులు దుకాణం ఉన్న రాష్ట్రంలోని లీగల్ మెట్రాలజీ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు.
  • వినియోగదారులు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌ని 1800-11-4000/ 1915లో సంప్రదించవచ్చు. లేదా వారి సంబంధిత జిల్లాలోని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
  • అలాగే 8800001915కు ఎస్ఎంఎస్ చేయవచ్చు. ఎన్సీహెచ్ యాప్, ఉమంగ్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదులను పొందవచ్చు.
  • వినియోగదారులు ఈ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదును కూడా ఫైల్ చేయవచ్చు. ఫిర్యాదు చేయడానికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. రిజిస్ట్రేషన్ కోసం వెబ్ పోర్టల్ కి వెళ్లి లాగిన్ లింక్‌పై క్లిక్ చేసి, ఆపై అవసరమైన వివరాలను తెలియజేస్తూ సైన్ అప్ చేయాలి. మీ ఈమెయిల్ ద్వారా ధృవీకచాలి. ఆ తర్వాత  వినియోగదారు ఐడీ, పాస్‌వర్డ్ తో ఫిర్యాదు చేయవచ్చు.
  • నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైనా పరిష్కారం లభించకపోతే .. వినియోగదారు ప్రీ లిటిగేషన్ కేసు వేయవచ్చు. కమిషన్‌ను సంప్రదించవచ్చు. ఎన్సీడీఆర్సీ వెబ్ సైట్ ద్వారా రాష్ట్ర కమిషన్, జిల్లా కమిషన్ లకు ఫిర్యాదుచేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: రన్నింగ్‌ కారు డిక్కీలో వేలాడుతూ కినిపించిన చేయి...
Viral Video: రన్నింగ్‌ కారు డిక్కీలో వేలాడుతూ కినిపించిన చేయి...
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. నయా ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్.!
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. నయా ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్.!
మహిళ ముందు ప్యాంటు జిప్‌ తీసి.. ప్రైవేట్‌ పార్ట్‌ను చూపిస్తూ.. !
మహిళ ముందు ప్యాంటు జిప్‌ తీసి.. ప్రైవేట్‌ పార్ట్‌ను చూపిస్తూ.. !
రిస్క్ చేసేందుకు నేను రెడీ.. పూరీని సపోర్ట్ చేసిన విజయ్ సేతుపతి
రిస్క్ చేసేందుకు నేను రెడీ.. పూరీని సపోర్ట్ చేసిన విజయ్ సేతుపతి
హిందూ ట్రస్ట్‌లో ముస్లింలను అనుమతిస్తారా.. : సుప్రీం కోర్ట్
హిందూ ట్రస్ట్‌లో ముస్లింలను అనుమతిస్తారా.. : సుప్రీం కోర్ట్
అమెరికాపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్న చైనా..!
అమెరికాపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్న చైనా..!
కిచెన్ పనులు చకచకా కావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!
కిచెన్ పనులు చకచకా కావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!
మెంతులు తమలపాకులతో కలిపి తినడం వల్ల ఈ సమస్యలు పరార్‌..!
మెంతులు తమలపాకులతో కలిపి తినడం వల్ల ఈ సమస్యలు పరార్‌..!
ఈ పాన్ ఇండియా స్టార్‌ను గుర్తుపట్టారా.?
ఈ పాన్ ఇండియా స్టార్‌ను గుర్తుపట్టారా.?
ప్రిన్సిపాల్‌ రూమ్‌ నిండా పేడపూసిన విద్యార్థులు..ఏసీ అవసరం లేదంటూ
ప్రిన్సిపాల్‌ రూమ్‌ నిండా పేడపూసిన విద్యార్థులు..ఏసీ అవసరం లేదంటూ