IRCTC Ticket Booking: రైలు టికెట్ బుక్ చేయడానికి సింపుల్ టిప్స్ ఇవిగో.. కష్టం ఏమి ఉండదు.. చాలా ఈజీ

ఐఆర్‪సీటీసీ ద్వారా రైల్వే టికెట్లను సులభంగా, వేగంగా బుక్ చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా మీరు మీ అకౌంట్ ని ఐఆర్‪సీటీసీ వెబ్ సైట్ లేదా యాప్ లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? తెలుసుకుందాం..

IRCTC Ticket Booking: రైలు టికెట్ బుక్ చేయడానికి సింపుల్ టిప్స్ ఇవిగో.. కష్టం ఏమి ఉండదు.. చాలా ఈజీ
Follow us
Madhu

|

Updated on: Mar 29, 2023 | 1:45 PM

రైల్వే టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే రోజులు పోయాయి. గతంలో ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ కి వెళ్లి.. ఓ ఫారం తీసుకొని దానిని ఫిల్ చేసి టికెట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అత్యాధునిక సాంకేతికతతో ఇంట్లో కూర్చొని అరచేతిలో ఉన్న ఫోన్ ద్వారా ఆన్ లైన్ లో రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు. అందుకోసం రైల్వే శాఖ ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను తీసుకొచ్చింది. దానిపేరు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‪సీటీసీ). దీని ద్వారా రైల్వే టికెట్లను సులభంగా, వేగంగా బుక్ చేసుకోవచ్చు. అయితే అందుకోసం ముందుగా మీరు మీ ఐఆర్‪సీటీసీ అకౌంట్ ని  వెబ్ సైట్ లేదా యాప్ లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? అనే వివరాలు తెలుసుకుందాం..

అకౌంట్ ఇలా క్రియేట్ చేయాలి..

  • ఐఆర్‪సీటీసీ వెబ్‌సైట్ లోకి వెళ్లాలి.
  •  పేజీ కుడి వైపు పైన మూలలో ఉన్న ‘Register’ బటన్‌పై క్లిక్ చేయాలి.
  •  యూజర్ టైప్ ‘Individual’ ఎంచుకోవాలి.
  •  మీ పేరు, పుట్టిన తేదీ, జండర్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, అడ్రస్ వంటి అవసరమైన వివరాలను నింపాలి.
  •  మీ ఐఆర్‪సీటీసీ అకౌంట్ కోసం యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి.
  •  యూజర్ నేమ్ ప్రత్యేకంగా 3 నుంచి 35 అక్షరాల మధ్య ఉండేలా చూసుకోవాలి.
  • సెక్యూరిటీ ప్రశ్నను ఎంచుకొని, గుర్తుపెట్టుకోవాలి.
  • క్యాప్ చా కోడ్‌ని ఎంటర్ చేయడం ద్వారా మీ ఖాతాను ధ్రువీకరించండి.
  • ఆ తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీలకు ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది.
  • ఆ ఓటీపీని ఎంటర్ చేసి మళ్లీ సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది.

ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్‌ను ఇలా బుక్ చేసుకోవాలి..

  •  మీ ఐఆర్‪సీటీసీ అకౌంట్ లోకి లాగిన్ చేయాలి.
  •  ప్రయాణ తేదీతో పాటు బయలుదేరే, గమ్యస్థాన స్టేషన్‌లను ఎంచుకోవాలి.
  •  ఆ తర్వాత ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, చైర్ వంటి ట్రావెల్ క్లాసుల్లో మీరు ఏదోకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  •  ఇప్పుడు అందుబాటులో ఉన్న రైళ్లు, సమయాలను చెక్ చేయడానికి ‘Find Trains’పై క్లిక్ చేయాలి.
  •  మీరు ప్రయాణించాలనుకుంటున్న రైలును ఎంచుకుని, ‘Check Availability & Fare’పై క్లిక్ చేయాలి.
  •  కోటాను (జనరల్, తత్కాల్, లేడీస్ మొదలైనవి) ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని, ‘Book Now’పై క్లిక్ చేయాలి.
  •  ప్రయాణికుల వివరాలను (పేరు, వయస్సు, లింగం, బెర్త్ ప్రాధాన్యత వంటివి) రిజిస్టర్ చేసి ‘Continue Booking’పై క్లిక్ చేయాలి.
  •  మీ బుకింగ్ వివరాలను సమీక్షించి, ‘Make Payment’పై క్లిక్ చేయాలి.
  • పేమెంట్ పద్ధతిని (క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఈ-వాలెట్ వంటివి) ఎంచుకోండి. పేమెంట్ వివరాలను ఎంటర్ చేయాలి.
  •  మీ బుకింగ్‌ను పూర్తి చేసేందుకు ‘Payment’పై Click చేయాలి.
  • పేమెంట్ పూర్తయిన తర్వాత, మీ టిక్కెట్ వివరాలతో confirmation మెసేజ్, ఇమెయిల్‌ను అందుకుంటారు.
  • ఆ టికెట్ ను ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!