AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infinix Hot 30i: ఫోన్ అంటే ఇదే కదా..! రూ.9 వేలకే 24జీబీ ర్యామ్.. ఫీచర్లు చూస్తే అద్దిరిపోవాల్సిందే..

8 జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ వేరియంట్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో  వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు..

Infinix Hot 30i: ఫోన్ అంటే ఇదే కదా..! రూ.9 వేలకే 24జీబీ ర్యామ్.. ఫీచర్లు చూస్తే అద్దిరిపోవాల్సిందే..
Infinix Hot 30i
శివలీల గోపి తుల్వా
| Edited By: |

Updated on: Mar 30, 2023 | 8:35 AM

Share

Infinix Hot 30i: ఇన్‌ఫీనిక్స్ హాట్ 30ఐ స్మార్ట్‌ఫోన్ సోమవారం భారత్ మార్కెట్‌లోకి విడుదలైంది. ఎన్నో రకాల అధునాతన ఫీచర్లను కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో పాటు.. ఫోన్ వెనక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంది. ఇక దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌ కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అంతేకాక ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజుల స్టాండ్‌బైని ఇస్తుందని దాని కంపెనీ పేర్కొంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే లాంచ్ అయింది. ఇక దీని ధర రూ.8,999 మాత్రమే. అయితే దీనిని ఇది స్పెషల్ లాంచ్ ప్రైస్ అని కంపెనీ అంటోంది. అంటే ఇదే ధర ఎంత వరకు ఉంటుందో చెప్పలేము. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 30ఐ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఇవి కూడా చదవండి

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేస్తుంది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో పాటు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ ఇందులో ఉన్నాయి. ఇంకా టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్ ఆక్టాకోర్ 6 ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంది. కెమెరా గురించి చెప్పుకోవాలంటే.. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు ఏఐ లెన్స్ కూడా ఈ ఫోన్ వెనక అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంది. ముందువైపు, వెనకవైపు డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌లను అందించడం దీని ప్రత్యేకతలు.

ఇంకా  8 జీబీ ర్యామ్+128 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ వేరియంట్‌గా వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో  వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఇంకా కనెక్టివిటీ కోసం 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్, ఓటీజీ, వైఫై వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో ఉంటుంది. ఫేస్ అన్‌లాక్ ద్వారా కూడా ఫోన్ ఓపెన్ చేయవచ్చు. ఇక ఈ ఫోన్‌ను కొనుగోలు చేయదలిచినవారికి ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా లభించనుంది. దీని స్టాండర్డ్ ఈఎంఐ ఆప్షన్లు రూ.317 నుంచి ప్రారంభం కానున్నాయి. డైమండ్ వైట్, గ్లేసియర్ బ్లూ, మిర్రర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్