G20 Summit 2023: నేటి నుంచే విశాఖలో జీ20 వర్కింగ్ గ్రూప్ సదస్సు.. 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు రాక..

మార్చి 28, 29 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న G20 సదస్సుకు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ సదస్సుకు మన విశాఖపట్నం వేదికగా మారింది.ఇప్పటికే సదస్సు

G20 Summit 2023: నేటి నుంచే విశాఖలో జీ20 వర్కింగ్ గ్రూప్ సదస్సు.. 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు రాక..
G20 Summin Visakhapatnam
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 28, 2023 | 8:03 AM

మార్చి 28, 29 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న G20 సదస్సుకు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ సదస్సుకు మన విశాఖపట్నం వేదికగా మారింది.ఇప్పటికే సదస్సు నిర్వహణకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేశామని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సల్మాన్ ఆరోక్య రాజ్  తెలిపారు. మొత్తం 7 సెషన్స్(మొదటి రోజు 4, రెండో రోజు 3), ఒక వర్క్ షాప్ జరగనున్నాయని, ఈ సదస్సులో దాదాపు 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు హజరవుతారని ఆయన తెలిపారు. సదస్సు అనంతరం అంటే.. 30న G20 దేశాలు నుంచి వచ్చిన వారికి ట్రైనింగ్ క్లాస్‌లు ఉంటాయని, మిగిలిన దేశాలవారికి వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు. అలాగే 31న దేశంలోని అన్ని నగరపాలక సంస్థల కమిషనర్లు, G20 ప్రతినిధుల పరస్పర అవగాహనా సదస్సు నిర్వహిస్తారు. మొత్తం 4 రోజుల పాటు విశాఖలో G20 ప్రతినిధి బృందం బస చేయనుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సదస్సుకు సీఎం జగన్‌ కూడా హాజరు కానున్నారు. 28వ తేదీ సాయంత్రం విశాఖలో ల్యాండ్‌ కానున్న సీఎం జగన్.. G20 ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గాలా డిన్నర్‌కు హాజరవుతారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల నుంచి 8.30 వరకు అక్కడే ఉంటారు సీఎం.

మరోవైపు ‘G20 సదస్సు 2023’ ఢిల్లీ వేదికగా సెప్టెంబర్‌లో  జరగనుంది. ఇందులో భాగంగానే దేశంలోని 50 ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే G20 సన్నాహక సదస్సులు బెంగళూరు, చండీగఢ్, చెన్నై, గువహతి, ఇండోర్, జోథ్‌పూర్, ఖజురహో, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే, రాణ్ ఆఫ్ కచ్, సూరత్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్‌ వంటి పలు నగరాలలో జరిగాయి. ఈ క్రమంలోనే మార్చి 28, 29 రోజులలో విశాఖపట్నం వేదికగా జరగనున్న G20 సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది.  G20 దేశాల సదస్సు నిర్వహాణకు కావలిసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందు కోసం సదస్సు నిర్వహణ ప్రాంతాన్ని 2500 మంది పోలీసులు మొహరించనున్నారు. ఇక వీరిలో 1850 మంది సివిల్ పోలీసులు, 400 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, 4 గ్రే హౌండ్స్ దళాలు, 2 క్యూఆర్టీ టీమ్స్, 6 ప్రత్యేక పార్టీలు, 2 ఏపీఎస్పీ ప్లాటూన్లు ఉండడం విశేషం.

జీ20 సదస్సు నేపధ్యంలో విశాఖపట్నం నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాల్ని సుందరంగా అలంకరించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పర్యాటక ప్రదేశాలకు రేపు స్థానికులకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్  సీహెచ్.శ్రీకాంత్ తెలిపారు. విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న G20 సదస్సు సందర్భంగా ఆయన ఇతర  అధికారులతో సమావేశం నిర్వహించారు. తర్వాత విశాఖలో ఆ తేదీల్లో ఎలాంటి ఆంక్షలు విధిస్తారో తెలిపారు. ఆయన మాట్లాడుతూ  సిబ్బంది ధరించవలసిన యూనిఫారం, సదస్సు వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నియమాలు, ట్రాఫిక్, ఇతర విధుల నిర్వహణలో పాటించాల్సిన రూల్స్ ఏమిటో తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే