Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Children Health: ఈ 4 పదార్థాలను మీ పిల్లలకు తినిపిస్తే చాలు.. ఎటువంటి ఆరోగ్య సమస్యలైన వారి దరి చేరవు..

రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా కూడా సక్రమంగా ఉంటుంది. ఇంకా ఇన్‌ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. రోగ నిరోధక..

Children Health: ఈ 4 పదార్థాలను మీ పిల్లలకు తినిపిస్తే చాలు.. ఎటువంటి ఆరోగ్య సమస్యలైన వారి దరి చేరవు..
Nutrition For Children
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 27, 2023 | 1:10 PM

చాలా మంది పిల్లలు తరచూ జలుబు, దగ్గు వంటి అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఇలాంటి సమస్యలకు మందులే కాదు.. ఇంటి చిట్కాలు కూడా చక్కగా పని చేస్తాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వారు తినే ఆహారమే వారికి శ్రీరామ రక్షగా పని చేస్తుందని అంటే అతిశయోక్తి కానే కాదు. ఇక వేసవికాలంలో పిల్లలు  ఇంటి పట్టున ఉండకుండా.. మండే ఎండలలో తిరగడం వల్ల వెంటనే నిరసపడి పోతుంటారు. ఇంకా వాతావరణ మార్పుల వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుంది. ఫలితంగా తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం తప్పనిసరి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఆరోగ్యంగా కూడా సక్రమంగా ఉంటుంది. ఇంకా ఇన్‌ఫెక్షన్ల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలనే తినాల్సి ఉంటుంది. మరి అలాంటి ఆహార పదార్థాల్లో డ్రై ఫ్రూట్స్‌ది ప్రథమ స్థానం అని చెప్పాలి. మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడే డ్రై ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం పప్పులు: డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే బాదం తినడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు నిపుణులు. రోజూ పిల్లలకు బాదంపప్పు తినిపించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది. బాదంపప్పులోని మరో ప్రత్యేకత ఏంటంటే.. పిల్లల మానసిక, శారీరక వికాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నానబెట్టిన బాదంపప్పులను పిల్లలకు రోజూ ఇవ్వండి.

చిల్‌గోజా: చిల్‌గోజాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు A, E, B1, B2, C, కాపర్, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. రక్త హీనతను తగ్గిస్తుంది. పిల్లలకు రోజూ 2 నుండి 3 చిల్‌గోజా లను తినిపిస్తే వారు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.

ఇవి కూడా చదవండి

వాల్‌నట్స్: బ్రెయిన్ ఫుడ్ అని పిలిచే వాల్ నట్స్ లో శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఇతర ముఖ్యమైన విటమిన్లు కూడా ఉన్నాయి. అక్రోట్లు, B1, B2, B6 ఉంటాయి. ప్రతి రోజూ పిల్లలకు వాల్‌నట్‌లను తినిపించడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పిస్తా పప్పులు: పిస్తాలో ఇనుము, పొటాషియం, రాగి, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి. అంతే కాదు ఇందులో విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. ఖనిజాలు, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పిస్తాపప్పు తినడం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..