Hilarious Video: ఇదెక్కడి హోళీరా బాబు..! యువతి ముఖంపై కారం కొట్టిన యువకుడు.. ఆపై ఏమయ్యింఏందంటే..?

ప్రేమికులు అయితే శరీరం నిండా రంగులు పులుముకుని.. వచ్చే హోళీ వరకు గుర్తుండిపోయేలా ఫోటోలు, రీల్స్ తీసుకుంటారు. ఇక వాటిని సోషల్ మీడియోలో పోస్ట్ చేసి సోషల్ కరెన్సీలా ఉపయోగించుకుంటారు. అయితే..

Hilarious Video: ఇదెక్కడి హోళీరా బాబు..! యువతి ముఖంపై కారం కొట్టిన యువకుడు.. ఆపై ఏమయ్యింఏందంటే..?
Holi With Mirchi Powder
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 27, 2023 | 10:51 AM

హోళీ అంటేనే సరదా. ఒకరి మీద ఒకరు రంగులు వేసుకుంటూ సంతోషంగా గడిపే హోళీ అంటే ఇష్టపడని యువతీయువకులు ఉండరు. ముఖ్యంగా ప్రేమికులు అయితే శరీరం నిండా రంగులు పులుముకుని.. వచ్చే హోళీ వరకు గుర్తుండిపోయేలా ఫోటోలు, రీల్స్ తీసుకుంటారు. ఇక వాటిని సోషల్ మీడియోలో పోస్ట్ చేసి సోషల్ కరెన్సీలా ఉపయోగించుకుంటారు. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఇది సరదా వీడియో కాదు, సరదా తీర్చిన వీడియో. హోళీ  రోజున రంగులు పులుముకుంటారుగా.. అలాగే ఈ వీడియోలో కూడా ఒక యువకుడు తన దగ్గరకు కోరి వచ్చిన అమ్మాయి ముఖం మీద అనుకోకుండా కారం పొడిని పూస్తాడు. దీంతో ఆమె కళ్లు మంటలెక్కి అక్కడిక్కడే నాట్యం చేసేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.

manishvaaa అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయిన వీడియోలో మనం ఈ దృశ్యాలను చూడవచ్చు. ఆ వీడియోలో హోళీ సందర్భంగా తల మీద పడిన రంగును దులుపుకుంటూ ఉంటాడు ఓ యువకుడు. అంతలోనే ఓ యువతి అక్కడకు వచ్చి, అతన్ని కవ్వించేలా బుగ్గపై రంగు పూసుకుంటుంది. ఆ యువకుడు కూడా అలాగే చేస్తాడు. అనంతరం ఆ యువతి ఓ ఆడుగు ముందుకేసి యువకుడి చెంప మీద రంగు అలుముతుంది. అప్పుడు ఆ యువకుడు కూడా అలాగే చేయాలనుకుంటాడు. కానీ అతని చేతిలో రంగు లేదు. అయితే ఆ వెంటనే అతని వెనుక నుంచి ఓ మహిళ కారం పొడిని ప్లేట్‌లో తీసుకుని వెళ్తుంటుంది. ఇక దానిని రంగు అనుకుని ఆ యువతి ముఖం మీద  రాస్తాడు. కారం ముఖం మీద పడితే ఏమవుతుంది..? వెంటనే ఆ అమ్మాయికి కళ్లు మంటెక్కి అక్కడే డ్యాన్స్ స్టెప్పులేసింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. 

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by MANI (@manishvaaa)

అంతేకాక వారికి తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘మంచి మూమెంట్‌ని పాడు చేసుకున్నావ్ భయ్యా..’ అంటూ రాసుకొచ్చాడు. మరో నెటిజన్ ‘అరే.. చూసుకోవాలి కదా..’ అని కామెంట్ చేశాడు. ‘నేనైతే అలా చచ్చినా చేయను.. రంగు లేకపోతే నా చేతులోనే బుగ్గపై రాసేవాడిని’ అని మరో నెటిజన్ అన్నాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా వీక్షణలు,. 109 వేల లైకులు వచ్చాయి. ఇంకా వందలాది కామెంట్లు కూడా లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..