River Highway: చుట్టూ కొండలు, కింద నీళ్లు, నది మధ్యలో రోడ్డు.. ఇలాంటి వీడియో ఇప్పటి వరకు చూసి ఉండరు..
అన్నీ అనుకూలంగా ఉన్న చోట నిర్మాణాలు చేపడితే.. వింతేముంటుంది. సాధ్యం కాని చోట చేసి చూపించడం గొప్ప. అదే చేసి నిరూపించారు చైనా ఇంజనీర్లు. నిర్మాణ సమయం, వ్యయం తగ్గించడానికి
అన్నీ అనుకూలంగా ఉన్న చోట నిర్మాణాలు చేపడితే.. వింతేముంటుంది. సాధ్యం కాని చోట చేసి చూపించడం గొప్ప. అదే చేసి నిరూపించారు చైనా ఇంజనీర్లు. నిర్మాణ సమయం, వ్యయం తగ్గించడానికి చైనా ఇంజినీర్లు చేసిన ఓ అద్భుత ప్రయోగం.. రివర్ హైవే.. దాన్ని చూసిన వారంతా ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. నదిని దాటేందుకు బ్రిడ్జిల నిర్మించడం సర్వసాధారణం. కానీ చైనాలో నది మధ్యలోనే బ్రిడ్జిని నిర్మించి హైవే వేశారు. గత కొన్నేళ్లుగా ఈ మార్గంలో వేలాది వాహనాలు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. జింగ్‌షాన్ కౌంటీలోని గుఫుచెన్‌ను షాంఘై, చెంగ్డు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయడానికి చైనా ప్రభుత్వం ఈ రివర్ హైవేనే నిర్మించింది. దీన్ని నది పొడవునా 4.4 కిలోమీటర్ల దూరం బ్రిడ్జిలతో హైవే నిర్మించింది. దాని నిర్మాణ శైలి. జియాంగ్జీ నది మధ్యలో వాహనాలు వేగంగా వెళ్తుంటే ఆ దారికి ఇరువైపులా ప్రకృతి సిద్ధంగా ఉన్న కొండలను చూస్తూ వావ్ అనకుండా ఉండలేరు. నది మధ్యలో వాహనాలతో దూసుకెళ్తున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. అయితే ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ఆ రోడ్డును వెడల్పు చేయాలంటే.. చాలా చోట్ల టన్నెళ్లు తవ్వాల్సి ఉంటుంది. కొండలు బద్దలుగొట్టాలి. నివాసాలను ఖాళీ చేయించాలి. ఈ తలనొప్పులతో పోలిస్తే నది మధ్యలో వంతెన నిర్మించడం సులభమని చైనా ఇంజినీర్లు భావించారు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. అందుకు ఓకే చెప్పింది. మొత్తానికి రూ.585 కోట్లలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. ఈ ‘రివర్ హైవే’ను సందర్శించే పర్యాటకుల తాకిడి కూడా అంతకంతకు పెరుగుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

