AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

First Night Video: మీ దుంపతెగ..! ఇన్‌స్టాలో ఫస్ట్‌నైట్ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

తాజాగా పెళ్లైన ఓ జంట సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా వారి  ఫస్ట్ నైట్ వీడియోను రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఒక్క సారిగా ఖంగు తిన్నట్లయింది. అంతటితో..

First Night Video: మీ దుంపతెగ..! ఇన్‌స్టాలో ఫస్ట్‌నైట్ వీడియో.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
Couples First Night Visuals
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 26, 2023 | 10:04 PM

Share

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చేశాక.. అందులో ఫేమస్ కావడానికి కొందరు చేసే ప్రయత్నాలు సహజత్వానికి విపరీతంగా ఉంటాయి. ఆ క్రమంలో కొందరు బైక్స్ మీద స్టంట్స్ చేస్తే, మరి కొందరు ప్రాంక్ వీడియోలు, వింత వింత స్టెప్పులతో డ్యాన్స్ వీడియోలు చేస్తుంటారు. అయితే తాజాగా పెళ్లైన ఓ జంట సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా వారి  ఫస్ట్ నైట్ వీడియోను రికార్డు చేసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ఒక్క సారిగా ఖంగు తిన్నట్లయింది. అంతటితో నెటిజన్లు ఊరుకుంటారా..? రకరకాల కామెంట్లతో తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

arushi & rahul అనే దంపతులకు చెందిన arushirahulofficial ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఈ వీడియో షేర్ అయింది. సరదా కోసం రికార్డ్ చేసిన ఫస్ట్ నైట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయింది. ఈ వీడియోలో ఏం జరిగిందో మీరే చూడవచ్చు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 29 వేల లైకులు, 13 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఇదే క్రమంలో పలువురు నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇక వారిలో ఒక నెటిజన్ అయితే.. ‘ఫస్ట్ నైట్ వీడియోను రికార్డు చేసి, సోషల్ మీడియాలో పెట్టడానికి సిగ్గు లేదా..?’ అని ఘాటూగా ప్రశ్నించాడు. అలాగే మరో నెటిజన్ ‘ఇంకెందుకు లేట్..’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్ల కామెంట్లను చూడలేక ఆ జంట కామెంట్స్ సెక్షన్‌ని డిసేబుల్ చేసి సర్దుకున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..