Vastu Tips: ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే చాలు.. అన్నిరకాల వాస్తు సమస్యలకు చెక్ పెటినట్లే..

ప్రజలు సాధారణంగానే ప్రతిసారీ తన కొత్త సంవత్సరాన్ని సుఖసంతోషాలతో గడపాలనుకుంటారు. అయితే వారికి తెలియకుండానే తమ ఇంట్లో ఉన్న కొన్ని వాస్తు దోషాలు అందుకు ప్రతికూల ఫలితాలనిస్తాయి. ఈ క్రమంలో..

Vastu Tips: ఈ 5 వస్తువులు మీ ఇంట్లో ఉంటే చాలు.. అన్నిరకాల వాస్తు సమస్యలకు చెక్ పెటినట్లే..
Vastu Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 27, 2023 | 2:05 PM

Vastu Tips: జ్యోతిష్య శాస్త్రం మాదిరిగానే వాస్తు శాస్త్రం, దానిలోని నియమాలు మానవ జీవితంపై అనేక రకాల ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇదే విషయాన్ని తరతరాలుగా మన పూర్వీకుల కాలం నాటి నుంచి కూడా నమ్ముతు వచ్చారు. కొన్ని రోజుల క్రితమే మనం కొత్తగా శోభకృత్ నామ సంవత్సరంలో ఆడుగుపెట్టాం. ప్రజలు సాధారణంగానే ప్రతిసారీ తన కొత్త సంవత్సరాన్ని సుఖసంతోషాలతో గడపాలనుకుంటారు. అయితే వారికి తెలియకుండానే తమ ఇంట్లో ఉన్న కొన్ని వాస్తు దోషాలు అందుకు ప్రతికూల ఫలితాలనిస్తాయి. ఈ క్రమంలో కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే మనం కోరకున్న సుఖ సంతోషాలకు, సిరిసంపదలను పొందవచ్చు. ఇవి జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం మీ పురోగతి, సంపద, ఆనందం, శ్రేయస్సు మీరు తీసుకునే వాస్తు చర్యలపై ఆధారపడి ఉంటుంది. మరి ఈ క్రమంలో ఎటువంటి వాస్తు చిట్కాలను పాటించాలో మనం ఇప్పుడు చూద్దాం..

లోహపు తాబేలు: లోహంతో చేసిన తాబేలు ఇంటికి శుభప్రదమని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉత్తరం వైపున ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఉండదు. ఆనందం, శ్రేయస్సు మీ వెంటే ఉంటుంది.

ముత్యాల శంఖం: ముత్యాల శంఖం ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మీరు వాస్తు సూచనలను పాటిస్తే ముత్యపు శంఖాన్ని భద్రంగా ఉంచి పూజించాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ధన సమస్యలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

తులసి: ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని కొనసాగించడానికి నూతన సంవత్సరం సందర్భంగా తులసి మొక్కను నాటండి. ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదమని చెబుతారు.

గోమతీ చక్రం: గోమతీ చక్రం నెగటివ్‌ శక్తులను నివారించడానికి సహాయపడుతుంది. అంతే కాదు శ్రేయస్సు, సంతోషం, మంచి ఆరోగ్యం, సంపద, మానసిక ప్రశాంతత అందిస్తుంది. వాస్తు ప్రకారం గోమతీ చక్రాన్ని పసుపు గుడ్డలో కట్టి ఖజానాలో ఉంచవచ్చు. ఇలా చేస్తే ఇంట్లో శుభం కలుగుతుంది.

పిరమిడ్: పిరమిడ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంట్లో సానుకూల శక్తిని కలిగిస్తుంది. దీని సహాయంతో మీరు వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. పిరమిడ్ తన చుట్టూ ఉన్న వస్తువుల లక్షణాలను మార్చగలదని అంటారు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఇంట్లో తప్పకుండా పిరమిడ్లను తీసుకురావాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!