Tirupati: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం..
తిరుమల భక్తులకు శుభవార్త. కొండపై సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి. టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఈ బస్సులను ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు చెందిన ‘ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్’ సంస్థ ఈ బస్సులను తయారు చేసింది. హైదరాబాద్ సమీపంలోని ప్లాంట్‌లో
తిరుమల భక్తులకు శుభవార్త. కొండపై సామాన్య భక్తుల సౌకర్యార్థం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి. టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఈ బస్సులను ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు చెందిన ‘ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్’ సంస్థ ఈ బస్సులను తయారు చేసింది. హైదరాబాద్ సమీపంలోని ప్లాంట్‌లో తయారుచేసిన ఈ బస్సులను టీటీడీకి కానుకగా అందజేసింది. తిరుమల కొండపై ఇప్పటికే ‘ధర్మరథం’ పేరుతో డీజిల్ బస్సులు భక్తుల కోసం ఉచిత సేవలు అందిస్తున్నాయి. కొండపై బస్టాప్, సత్రాల నుంచి ప్రధాన ఆలయానికి చేరుకునేందుకు భక్తులు ఈ బస్సులను వినియోగించుకుంటున్నారు. వీటికి అదనంగా 10 ఎలక్ట్రిక్ బస్సులు తోడయ్యాయి. అత్యాధునిక సాంకేతికతతో ఈ బస్సులను తయారు చేశారు. మొత్తం 18 కోట్ల విలువ చేసే 10 బస్సులను టీటీడీకి ఒలెక్ట్రా కంపెనీ విరాళంగా అందజేసిందని, ధర్మరథాల పేరుతో సామాన్య భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డీజిల్ బస్సుల స్థానంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలలో భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
తిరుమలలో పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఏడాది కిందటే ప్రారంభించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సీఎం జగన్ చొరవతో 65 ఎలక్ట్రిక్ బస్సులను ఏపీ ఆర్టీసీ నిత్యం తిరుపతి తిరుమల మధ్య నడుపుతోందన్నారు. వీటికి అదనంగా పది ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 9 మీటర్ల పొడవుండే ఈ బస్సులో 23 మంది సీట్లలో కూర్చొని ప్రయాణించవచ్చని తెలిపారు. భక్తులకు పూర్తి భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం అందించేలా బస్సును తయారు చేశారన్నారు. తిరుమల కొండపై భక్తులు శబ్ద, వాయు కాలుష్యంలేని ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..