మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నవారికి మరింత మేలు కలుగుతుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత వల్ల తలెత్తే పీసీఓఎస్, థైరాయిడ్, మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల హార్మోన్లు సమతులమై సమస్యలు అదుపులోనే ఉంటాయి.