గతంలో కొత్త పన్ను విధానంలో ఆరు శ్లాబులు ఉండేవి. ఏప్రిల్ 1 నుంచి కేవలం ఐదు శ్లాబులే ఉంటాయి. దీంతో రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రూ.3-6 లక్షల వరకు 5 శాతం, రూ.6-9 లక్షల వరకు 10 శాతం, రూ.9-12 లక్షల వరకు 15 శాతం, రూ.12-15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల కంటే అధికంగా ఉంటే 30 శాతం ట్యాక్స్ కట్టవల్సి ఉంటుంది.