- Telugu News Photo Gallery Business photos Hallmarking of gold jewellery mandatory from April 1; All you need to know is this
Gold: పసిడి ప్రియులకు అలెర్ట్.. ఇకపై గోల్డ్ కొనాలంటే ఇది తప్పనిసరి..
ప్రస్తుతం రోజురోజుకు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ ఆభరణాలతో బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా హాల్ మార్కింగ్ లేని బంగారు అభరణాలు చాలా షాపుల్లో విక్రయిస్తున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు.
Updated on: Mar 30, 2023 | 1:51 PM

భారతీయ మహిళలకు బంగారమంటే ఎంత ప్రీతి పాత్రమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలు, శుభకార్యాలు ఇలా ప్రత్యేక దినాల్లో కచ్చితంగా బంగారు ఆభరణాలతో మురిసిపోవాల్సిందే.

ప్రస్తుతం రోజురోజుకు బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ ఆభరణాలతో బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా హాల్ మార్కింగ్ లేని బంగారు అభరణాలు చాలా షాపుల్లో విక్రయిస్తున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు.

ఈక్రమంలో శనివారం (ఏప్రిల్ 1) నుంచి బంగారం కొనుగోలు విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రెండు గ్రాములకు మంచి బంగారం కొనాలన్నా, విక్రయించాలన్నా హాల్ మార్కింగ్ నిబంధనను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే హాల్‌మార్క్ లేని బంగారు అమ్మకాలు, కొనుగోళ్లు ఏప్రిల్ 1 నుంచి నిషేధం అన్న మాట.

బంగారం స్వచ్ఛత, నాణ్యతలను నిర్ధారించేదే హాల్‌మార్క్. ఇప్పటివరకు నాలుగు అంకెల, ఆరు అంకెల హాల్‌మార్కింగ్ విధానం ఉండేది. అయితే ఇకపై అక్షరాలు, అంకెలు కలిసి ఉండే (ఆల్ఫా న్యూమరిక్) సిక్స్ డిజిట్ హాల్‌మార్కింగ్ అమల్లోకి రాబోతోంది. దీనినే హాల్‌మార్క్ యునీక్ ఐడెంటిఫికేషన్ అని కూడా అంటారు.

ఈ హాల్ మార్కింగ్‌లో బంగారు దుకాణానికి చెందిన నంబరు, హాల్‌మార్కింగ్ పరీక్షా కేంద్రానికి చెందిన నంబరు కలిపి లేజర్ ప్రింటింగ్ ద్వారా బంగారంపైన యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ వేస్తారు. అలాగే బీఐఎస్ ముద్ర, బంగారం స్వచ్ఛత, నాణ్యత వివరాలను కూడా అచ్చువేస్తారు.

హాల్‌మార్కింగ్‌ను వెరిఫై చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం BIS Care appని తీసుకొచ్చింది. దుకాణాల్లో బంగారాన్ని కొనే ముందు, దాని మీద ముద్రించిన యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను అందులో ఎంటర్ చేసి, అది నిజమైన హాల్‌మార్కేనా? కాదా? అనేది నిర్ధారించుకోవచ్చు.





























