- Telugu News Photo Gallery Fashion and Health Tips Why You Need To Wash New Clothes Before You Wear Them
Wash New Clothes: కొత్త బట్టలను ఉతకకుండా అలానే వేసుకుంటున్నారా.. పెద్ద సమస్యల్లో మీరు పడుతున్నట్లే.. కారణం ఇదే..
మన సమాజంలో చాలా విషయాల్లో కట్టుబాట్లు, పట్టింపులు ఎక్కువగా ఉన్నాయని మనలో కొందరు విసుక్కుంటారు. కట్టుబాట్ల వెనుక సైన్స్ ఉంటుందని.. ఆరోగ్య సూత్రాలు ఉంటాయని చాలామందికి తెలియదు. ఇందులో ఒకటి కొత్త బట్టలను ఉతకకుండా వేసుకోవద్దని పెద్దలు సూచిస్తుంటారు. మరి అసలు దీనిలో శాస్త్రీయత ఏమైనా ఉందా..? అసలు కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 30, 2023 | 4:04 PM

కొత్త బట్టల విషయంలో మన పెద్దలు చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది. ఆరోగ్య నిపుణులు కూడా మన పెద్దలు చెప్పిన మాటలనే ఇప్పుడు తిరిగి గుర్తు చేస్తున్నారు. కొత్తగా తీసుకున్న బట్టలపై హానికర రసాయనాలు ఉంటాయట. అంతేకాకుండా మన కంటే ముందు చాలా మంది వాటిని ట్రయల్ చేసి ఉండొచ్చు.

ప్రతి ఒక్కరూ షాపింగ్‌ను ఇష్టపడతారు. మీరు షాపింగ్ మాల్స్‌లో గమనించినట్లయితే.. కొత్త బట్టలు కొనుగోలు చేసేటప్పుడు.. చాలా మంది ట్రయల్ రూమ్‌లో దుస్తులను ప్రయత్నిస్తారు.

అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్యానికి గురవుతారని మీకు తెలుసా. మనం కొత్త బట్టలు ట్రయల్ చేసిన బట్టల ద్వారా ఎన్నో రకాల వ్యాధులు మన శరీరంలోకి చేరుతాయని పరిశోధనలో వెల్లడైంది. నిజానికి మనకంటే ముందే చాలా మంది ఈ కొత్త బట్టలు వేసుకున్నారు. అంతే కాకుండా బట్టలకు రంగులు వేసేందుకు ఉపయోగించే రసాయనాల్లోని కొన్ని భాగాలు బట్టల్లోనే ఉంటాయి. మనం ఈ బట్టలు ధరించినప్పుడు, ఈ రసాయనాలు మన చర్మానికి అలెర్జీకి కారణం అవుతాయి.

మీరు మాల్‌లో ప్రయత్నిస్తున్న బట్టలు, మీకంటే ముందు వేసుకునేవి అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సార్లు ప్రజలు వేడిలో చల్లబరచడానికి మాల్‌లోకి వస్తుంటారు. అంతే కాదు టైంపాస్ కోసం బట్టలు కూడా ధరించడానికి ప్రయత్నిస్తారు.

చర్మ వ్యాధుల్లో ఒకరి నుంచి మరొకరికి ఈజీగా సక్రమిస్తాయి. ఒకవేళ కొత్త బట్టల వల్ల చర్మ సంబంధింత సమస్యలు తలెత్తితే వెంటనే చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి. అలా చేయకపోతే అలర్జీ, దురదలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే లక్షణం ఉన్న కరోనా లాంటి మహమ్మారుల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా హానికర బ్యాక్టీరియా, క్రిములు, పేను పురుగులు లాంటివి కూడా మన శరీరంలోకి ప్రవేశించి.. ఇన్ఫెక్షన్లకు గురిచేసే ప్రమాదం ఉందని అంటున్నారు.

మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని ఒకసారి ఉతికి, ఎండలో ఆరబెట్టాక వేసుకుంటే మంచిదని, ఆ రసాయనాలు పోతాయని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త బట్టల్ని ఉతకడమే గాక ఆరిన తర్వాత ఇస్త్రీ చేసుకుని తొడుక్కుంటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు.

వారి చెమట, దుమ్ము, మురికి వాటికి పట్టుకుంటుంది. వాటిని తిరిగి మీరు ధరించిన తర్వాత అవి మీ చర్మంపైకి వస్తాయి. దీని కారణంగా మీరు చర్మవ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే షాపింగ్ మాల్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఓ సారి వాటిని ఉతికి ధరించడం మంచిది.

ముఖ్యంగా చిన్న పిల్లలు కొత్త బట్టలు ఉతకకుండా ఎప్పుడూ ధరించనీయకూడదు. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.




