Orange Peel: ఆరెంజ్ తొక్కలు పడేస్తున్నారా? ఎన్ని లాభాలో..
నారింజ (ఆరెంజ్) పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఐతే మనమందరం ఆరెంజ్ తొక్కను తీసి లోపల ఉన్న పండ్లను మాత్రమే తింటాం. ఆరెంజ్ తొక్కల్లో కూడా పోషకాలు మెండుగానే ఉంటాయని..
నారింజ (ఆరెంజ్) పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఐతే మనమందరం ఆరెంజ్ తొక్కను తీసి లోపల ఉన్న పండ్లను మాత్రమే తింటాం. ఆరెంజ్ తొక్కల్లో కూడా పోషకాలు మెండుగానే ఉంటాయని అంటున్నారు నిపుణులు. నిజానికి చాలా వరకు పండ్ల తొక్కల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం.. నారింజ తొక్క లోని ఔషధ లక్షణాలు కఫం, పిత్తాన్ని నియంత్రిస్తుంది. నారింజ తొక్క తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొత్తికడుపులో అపానవాయువు తొలగిపోతుంది. అలాగే గ్యాస్, గుండెల్లో మంట, వాంతులు, యసిడిటీ నుంచి ఉపశమనం అందిస్తుంది. ఆకలిని ప్రేరేపించడంలో, వికారం తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. నారింజ తొక్క పౌడర్ శ్వాసనాళాల నుంచి శ్లేష్మాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేస్తుంది.
నారింజ తొక్కల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కరిగిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. అధిక కొలెస్ట్రాల్, ఊబకాయంతో బాధపడేవారు ఆరెంజ్ తొక్క తినడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. నారింజ తొక్కలోని హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ పెద్దప్రేగు క్యాన్సర్, బోలు ఎముకల వ్యాధుల నుంచి కాపాడుతంది. నారింజ తొక్కల నుంచి తీసిన నూనెలు నరాల సమస్యల నివారణకు, నిద్రలేమి నివారణకు ఉపయోగపడుతుంది. ఎండిన నారింజ తొక్క పౌడర్ చర్మానికి సహజసిద్ధమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి మృతకణాలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి, చర్మానికి మెరుపునిస్తుంది. ఆరెంజ్ తొక్క ముఖంలోని మలినాలను, బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే మొటిమలను కూడా తొలగిస్తుంది. ఇకపై నారింజ పండు తిన్న తర్వాత తొక్కలను పరవేయాలంటే కాస్త ఆలోచించుకోండి..
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.