Hair Care: నల్లని, బలమైన జుట్టు కోసం తీసుకోవలసిన ఆహారాలివే.. తింటే కేశ సమస్యలకు శాశ్వత పరిష్కారం..!
జుట్టు సమస్యలకు కాలుష్యం ఒక కారణం అయితే.. పౌష్టికాహార లోపం మరో కీలక కారణం. ఈ క్రమంలో మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే.. మీరు తినే ఫుడ్‌లో
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అలాయి శరీరంలో ఏ హానికరమైన మార్పు జరిగినా ముందుగా ప్రభావితమయ్యేవి జుట్టు, చర్మమే. ముఖ్యంగా చర్మం విషయానికొస్తే.. పొడవైన, అందమైన జుట్టును కోరుకోనివారుండరు. ముఖ్యంగా మగువలకు జుట్టు అంటే ప్రాణం. కానీ, చాలామంది మహిళలు జుట్టు సమస్యలతో సతమతం అవుతుంటారు. చండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టు బలహీనంగా ఉండటం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్యం ఒక కారణం అయితే.. పౌష్టికాహార లోపం మరో కీలక కారణం. ఈ క్రమంలో మీ జుట్టు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే.. మీరు తినే ఫుడ్‌లో పోషకాలు ఉండడం తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు రాలడం, జుట్టు పాలిపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చు. మరి జుట్టు బలంగా, రాలిపోకుండా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చిలగడదుంప: చిలగడదుంపలలో ఉండే బీటా కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ మూలకం సెబమ్ ఉత్పత్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీరం ఆరోగ్యంగా ఉంచటంతో పాటు.. జుట్టుకు కూడా మేలు చేస్తుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తాన్ని ప్రవాహా సక్రమంగా జరిగేలా చూస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు.. జుట్టు పొడవుగా, సిల్కీగా ఉండటానికి సహాయపడుతాయి.
పాలకూర: పాలకూరలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. మీ రెగ్యులర్ డైట్‌లో పాలకూర తింటే.. మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూరలో విటమిన్ సి, ఫోలేట్, ఐరన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
క్యాప్సికమ్: క్యాప్సికమ్‌లో పుష్కలంగా ఉండే విటమిన్ సి.. రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. ఇదే కాకుండా శరీరంలో ఐరన్ మొత్తాన్ని పెంచి జుట్టు సమస్యలను నివారిస్తుంది.
సాల్మన్ చేప: సాల్మన్ చేపలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. సాల్మన్ చేప జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టుకు మంచి పోషకాలు అందిస్తుంది. క్రమం తప్పకుండా సాల్మన్ తింటే జుట్టు రాలడం తగ్గుతుంది.
గ్రీక్ పెరుగు: గ్రీక్ పెరుగు కూడా జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. గ్రీక్ పెరుగులోఉండే విటమిన్ బి 5 జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
జామ: జామలో అధికస్థాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది. జామను హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు. జామ ఆకులను పేస్ట్‌గా చేసి హెయిర్ మాస్క్‌గా అప్లై చేస్తే జుట్టుకు చాలా మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..