IPL 2023: ‘16వ సీజన్ ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ ఆడనున్న 4 టీమ్‌లివే.. లిస్టులో ఏయే జట్లు ఉన్నాయంటే..?’

ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి జరగనుంది. ఐపీఎల్ కప్ కోసం మొత్తం 10 జట్లు పోడిపడబోతుండగా, వాటిలో 4 టీమ్‌లు మాత్రమే ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. ఇక రేపు జరగబోయే ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపనున్నాయి.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 30, 2023 | 9:46 AM

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాకముందే ప్లేఆఫ్స్‌కు చేరుకునే జట్ల లెక్కలపై సర్వేలు మొదలయ్యాయి. . ఐపీఎల్ కప్ కోసం మొత్తం 10 జట్లు పోడిపడబోతుండగా, వాటిలో 4 టీమ్‌లు మాత్రమే ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. అయితే టోర్నీ ప్రారంభం కాకమందే D&P అడ్వైజరీ ప్లేఆఫ్స్‌కు చేరే జట్ల మీద సర్వే చేసి.. తుదిదశకు చేరుకునే 4 టీమ్‌ల నివేదికను ప్రకటించింది.

1 / 7
 D&P అడ్వైజరీ అనేది స్టాటిస్టికల్ వాల్యుయేషన్ సర్వీస్ ప్రొవైడర్. IPL  టోర్నీ ఫలితాలను ఈ సంస్థ అంచనా వేస్తుంది. ఈ క్రమంలోనే D&P అడ్వైజరీ సంస్థ ప్లేఆఫ్స్‌కు చేరగలిగే నాలుగు జట్లను ప్రకటించింది.

2 / 7
 ఈ సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌లో ఆడటం దాదాపు ఖాయం. 50.1 శాతం గణాంకాలు సంజూ శాంసన్ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని సూచించాయి.

3 / 7
ఈ జాబితాలో లక్నో సూపర్‌జెయింట్స్ 49.8 శాతంతో ప్లేఆఫ్స్‌కు చేరుకునే నాలుగు జట్లలో 2వ స్థానంలో ఉంది. అంటే KL రాహుల్ నేతృత్వంలోని లక్నో టీమ్ ఈసారి ప్లేఆఫ్‌లను కూడా ఆడుతుందని D & P అడ్వైజరీ తెలిపింది.

4 / 7
ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 46.5 శాతంతో మూడో స్థానంలో ఉంది. D & P అడ్వైజరీ నివేదిక ప్రకారం ఈ ఏడాది కూడా ధోని సేన ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

5 / 7
ఇక ఈ నాలుగు జట్లలో 46% గణాంకాలతో ముంబై ఇండియన్స్ కూడా ఉంది. మరి రోహిత్ సేన ఈ టోర్నీలో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

6 / 7
ఇక ఈ నివేదిక ప్రకారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించడం కష్టమేనని తెలుస్తోంది. అలాగే రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ కూడా నష్టపోతుందని  D & P అడ్వైజరీ అంచనా వేసింది.

7 / 7
Follow us