Sunlight Benefits: సూర్యరశ్మితో ఆ క్యాన్సర్‌లకు చెక్.. ఇంకా బొలేడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సూర్యకాంతి, సూర్యరశ్మి వల్ల శరీరానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే సూర్యకాంతిలో..
సూర్యుని నుంచి వచ్చే కొన్ని రకాల కిరణాలు మన చర్మానికి హాని కలిగిస్తాయి. అంతేకాక వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సూర్యకాంతి, సూర్యరశ్మి వల్ల శరీరానికి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే సూర్యకాంతిలో విటమిన్ డి లోపాన్ని తగ్గించే శక్తి లభిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి పొందడానికి టాబ్లెట్స్‌ను వినియోగిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. టాబ్లెట్స్‌కు బదులుగా సూర్యకాంతి ద్వారా పొందిన విటమిన్ డి శరీరానికి చాలా మంచిది. ఇంకా ఈ సూర్యకాంతితో చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. మరి ఈ సూర్యరశ్మితో ఆరోగ్యానికి ఏయే ప్రయోజనాలున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్యరశ్మితో శరీరానికి కలిగే ప్రయోజనాలు..
చర్మ సమస్యల నివారణ: సూర్యరశ్మి వల్ల చర్మం నల్లగా మారుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ సూర్యరశ్మి శక్తి వల్ల చాలా రకాల చర్మ సమస్యలు దూరమవుతాయని నిపుణుల మాట. సూర్యుని UV కిరణాలు శరీరంపై పడడం వల్ల సోరియాసిస్, దురద, కామెర్లు, మొటిమలు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్‌లకు కారణమయ్యే అనేక బాక్టీరియాలను కూడా సూర్యరశ్మి నివారిస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ సూర్యరశ్మి కిరణాల ద్వారా విటమిన్ డి పొందాల్సి ఉంటుంది.
మానసిక ప్రశాంతత: మనసుకు కావలసిన ప్రశాంతతను అందించడంలో కూడా సూర్యకాంతి ఉపయోగపడుతుంది. అవును, మెదడులో ఉండే సెరోటోనిన్ అనే మూలకం సూర్యకాంతి ద్వారా వేగంగా విడుదల అవుతుంది. దీంతో ఒక రకమైన సంతోషకరమైన హార్మోన్ విడుదలవుతుంది. అంతేకాకుండా డిప్రెషన్ లేదా ఒత్తిడి సమస్యలు కూడా దూరమవుతాయి.
ఎముకల దృఢత్వం: సూర్యరశ్మి వల్ల శరీరానికి వేగంగా విటమిన్ డి అందుతుంది. ఫలితంగా అనేక రకాల ప్రయోజనాలతో పాటు బోన్ క్యాన్సర్స్ వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఎముకలు కూడా దృఢంగా మారతాయి. కాబట్టి ఎముకల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సూర్యరశ్మి వల్ల వచ్చే విటమిన్ డి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
రొమ్ము క్యాన్సర్: సూర్యరశ్మితో రొమ్ము క్యాన్సర్‌కి కూడా చెక్ పట్టవచ్చు. యూఎస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ బఫెలో, యూనివర్శిటీ ఆఫ్ ప్యూర్టోరికో శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో సూర్యరశ్మి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు. కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడేవారికి కూడా ఈ సూర్యరశ్మి ఉపయోగకరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..